Ind VS Aus Odi Series Latest Updates :  వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై ఇటీవ‌ల చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా సెలెక్టివ్ గా కొన్ని మ్యాచ్ ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటున్నాడు. తాజాగా దీనిపై భార‌త ఏస్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ స్పందించాడు. ఇక బుమ్రా..ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రిగిన సిడ్నీ టెస్టు నుంచి ఈ వ‌ర్క్ లోడ్ మేనేజ్మెంట్ ను పాటిస్తున్నాడు. ఆ  మ్యాచ్ లో గాయం కార‌ణంగా కొన్ని నెల‌ల పాటు బుమ్రా అంత‌ర్జాతీయ క్రికెట్ కు తను దూర‌మ‌య్యాడు. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు ఇంగ్లాండ్ తో జరిగన వన్డే, టీ20 సిరీస్ లకు తను దూరమయ్యాడు. అలాగే ఐపీఎల్లోనూ తను కొన్ని మ్యాచ్ లకు మాత్రమే పరిమితమయ్యాడు.  ఆ త‌ర్వాత ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపికైనా, అందులో కేవంల మూడు టెస్టుల్లో మాత్రమే ఆడాడు. ఆ త‌ర్వాత కూడా ఆసియాక‌ప్ లో పాల్గొన్న బుమ్రా.. అప్రాధాన్య మ్యాచ్ ల్లో బ‌రిలోకి దిగ‌లేదు. దీనిపై తాజాగా సిరాజ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

Continues below advertisement


చాలా కీల‌కం..
వ‌చ్చే రెండేళ్ల‌లో భార‌త్ కీల‌క‌మైన టోర్నీల‌ను ఆడ‌నుంద‌ని, అందుకు బుమ్రా అందుబాటులో ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఈ నేప‌థ్యంలోనే త‌ను సెలెక్టివ్ గా మ్యాచ్ లు ఆడుతున్నాడ‌ని పేర్కొన్నాడు. వ‌చ్చే ఏడాది టీ20 ప్రపంచ‌క‌ప్, 2027లో వన్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగ‌నుంద‌ని సిరాజ్ గుర్తు చేశాడు.  ఇక ఆసియాక‌ప్ త‌ర్వాత వెస్టిండీస్ తో జ‌రిగిన తొలి టెస్టులో బుమ్రా ఆడాడు. అయితే ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభ‌మ‌య్యే వ‌న్డే సిరీస్ కు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. 


గాయం అయితే క‌ష్టం..
ఇక బుమ్రా రెగ్యుల‌ర్ గా మ్యాచ్ లు ఆడే ప‌రిస్థితి లేద‌ని, సెలెక్టివ్ గా ఆడితేనే త‌ను అన్ని ఫార్మాట్లో ఆడ‌గ‌ల‌డ‌ని సిరాజ్ పేర్కొన్నాడు. నిజానికి గ‌త ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో త‌న కెరీర్ త్రెటినింగ్ గాయానికి గుర‌య్యాడ‌ని, అయితే మ‌రోసారి అలాంటి ప‌రిస్థితి ఎదురైతే త‌ను బౌలింగ్ చేసే అవ‌కాశం ఉండ‌బోద‌ని తెలిపాడు. గతంలో బుమ్రా సర్జరీ కూడా చేయించుకున్న విషయాన్ని పేర్కొన్నాడు.  సాధార‌ణంగా జ‌స్సీ భాయ్ ర‌న‌ప్, బౌలింగ్ శైలి డిఫ‌రెంట్ గా ఉంటాయ‌ని, ఈ నేప‌థ్యంలో వ‌ర్క్ లోడ్ మేనేజ్మెంట్ పై త‌ను తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్లు సిరాజ్ పేర్కొన్నాడు. దీంతో త‌న వర్క్ లోడ్ స‌మ‌తూకంగా ఉంటుంద‌ని, ఇందువ‌ల్ల ఎక్కువ‌కాలం త‌ను బౌలింగ్ చేయ‌డానికి ఆస్కారం ఏర్పడుతుంద‌ని తెలిపాడు. ముఖ్యమైన టోర్నీలో బుమ్రా ఆడటం జట్టుకు ఎంతో ప్లస్ పాయింట్ గా మారుతుందని తను వ్యాఖ్యానించాడు. మరోవైపు త్వరలోనే టెస్టుల నుంచి బుమ్రా రిటైర్మెంట్ తీసుకుని, వన్డే, టీ20లకు పరిమితం అవుతాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అలాగే వీటిపై కూడా బుమ్రా స్పందించలేదు. ఇక గాయాల కారణంగానే తను టీమిండియా కెప్టెన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందనేది విశ్లేషకులు చెబుతున్నగా మాటగా ఉంది.