India vs Afghanistan | ధర్మశాల: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. 37 ఏళ్ల నాటి రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టబోతున్నాడు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ శనివారం ధర్మశాల వేదికగా జరగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌ రోహిత్ శర్మ  అడుగు పెట్టగానే 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టనున్నాడు. వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున ఆడిన అత్యంత వృద్ధ (ఎక్కువ వయసు గల) క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. ఇటీవల అతడు ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు. దాంతో భారత జట్టులో కొనసాగుతున్నాడు. 

Continues below advertisement

రోహిత్ శర్మ ఈ మూడు వన్డేల సిరీస్ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు భారత జట్టుకు సిరీస్‌కు ముందు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో లేరు. విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా సైతం గాయాలతో బాధపడుతున్నారు. దాంతో వారిద్దరూ ఈ సిరీస్‌కుగానూ భారత జట్టులో భాగం కాలేకపోతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన నాటికి వీరిద్దరూ భారత జట్టులోకి పునరాగమనం చేస్తారని భావిస్తున్నారు.

Continues below advertisement

Also Read: Team India Seniors: టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ముసలం, హెడ్ కోచ్ గంభీర్‌ను కాదని బీసీసీఐ బాస్‌లతో సీనియర్ల సీక్రెట్ మీటింగ్స్..

రోహిత్ శర్మ పేరిట అత్యధిక వయసు ట్యాగ్ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచులో బరిలోకి దిగినప్పుడు రోహిత్ శర్మ వయసు 39 ఏళ్ల 44 రోజులు ఉంటుంది. దాంతో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యంత ఎక్కువ వయసు గల ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. 37 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇప్పటికి సరిగ్గా 37 ఏళ్ల కిందట 1983 వరల్డ్ కప్ ఛాంపియన్ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఈ రికార్డు ఉండేది. మోహిందర్ అమర్‌నాథ్ భారత్ తరఫున తన చివరి వన్డే మ్యాచ్‌ను 1989లో ఆడగా.. ఆ సమయంలో మోహిందర్ అమర్‌నాథ్ వయసు 39 ఏళ్ల 36 రోజులు ఉంది. 

IND vs AFG వన్డే సిరీస్ జట్టు

భారత్ ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.

Read Also: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్స్‌ వేటలో మెస్సీ టాప్-5... రొనాల్డో ర్యాంక్ ఎంత? ఆల్‌టైమ్‌ లెజెండ్స్ రికార్డుల పూర్తి లిస్ట్ ఇదే!

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, సిద్దిఖుల్లా అటల్, అఫ్సర్ జజాయ్, నంగ్యాలియా ఖరోటే, అబ్దుల్ మాలిక్, షరాఫుద్దీన్ అష్రఫ్, జియాయుర్ రహ్మాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ, రహ్మానుల్లా