Ben Stokes Dropped Joe Root Named Interim Captainఫ ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఊహించని సంచలనం నమోదైంది. నైట్‌క్లబ్ గొడవలో చిక్కుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్‌లపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కఠిన చర్యలు తీసుకుంది. న్యూజిలాండ్‌తో జూన్ 17 నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల స్క్వాడ్ నుంచి వీరిద్దరినీ బుధవారం సడన్‌గా తప్పించారు. ఈ ఇన్సిడెంట్ పై ప్రస్తుతం అఫీషియల్ ఎంక్వైరీ జరుగుతుండటంతో సెలెక్షన్‌కు వీరిని పరిగణనట్లోకి తీసుకోలేదని బోర్డు స్పష్టం చేసింది. స్టోక్స్ ప్లేస్‌లో ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను ఇంటర్మీడియట్ కెప్టెన్‌గా నియమిస్తూ ఈసీబీ ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. జూన్ 17 నుంచి 21 వరకు ది ఓవల్ మైదానంలో ఈ రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Read Also: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్స్‌ వేటలో మెస్సీ టాప్-5... రొనాల్డో ర్యాంక్ ఎంత? ఆల్‌టైమ్‌ లెజెండ్స్ రికార్డుల పూర్తి లిస్ట్ ఇదే!

లార్డ్స్ టెస్ట్ తర్వాత నైట్‌క్లబ్ వివాదం..ఈ వివాదం వెనుక ఉన్న అసలు మ్యాటర్ చూస్తే, లార్డ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమ్ 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీ తర్వాత ఆదివారం రాత్రి బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ లు ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ సోమవారం తెల్లవారుజామున ఒక రగ్బీ ప్లేయర్‌తో కలిసి వీరు ఒక ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ గొడవ టీమ్ ప్రోటోకాల్స్, డిసిప్లిన్ రూల్స్ బ్రేక్ చేసేలా ఉండటంతో ఈసీబీ దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ గొడవ కారణంగా బెన్ స్టోక్స్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా టాక్‌స్పోర్ట్ (TalkSport) మంగళవారం ఒక కథనంలో పేర్కొంది.

Read Also: Group of Death In FIFA World Cup 2026: గ్రూప్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి? ఫీఫా ప్రపంచ కప్‌లో అత్యధికంగా చర్చందే గ్రూప్ ఏది?

జట్టులోకి ఆర్చర్, జోర్డాన్ కాక్స్ ఎంట్రీఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు స్టోక్స్, అట్కిన్సన్‌లు జట్టుకు దూరం కానున్నారు. వీరి స్థానాలను భర్తీ చేయడం కోసం ససెక్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, ఎసెక్స్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌లను ఇంగ్లాండ్ బోర్డు అత్యవసరంగా స్క్వాడ్‌లోకి యాడ్ చేసింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆర్చర్ టెస్ట్ టీమ్‌లోకి రావడం గమనార్హం. కొత్త కెప్టెన్ జో రూట్ లీడర్‌షిప్‌లో ఇంగ్లాండ్ టీమ్ ఈ హోమ్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.

క్రమశిక్షణా చర్యలపై ఈసీబీ నజర్టీమ్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత నైట్‌క్లబ్‌లో గడపడంపై ఈసీబీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. క్రికెట్ రెగ్యులేటర్‌కు కూడా ఈ మ్యాటర్ ఇన్ఫార్మ్ చేశామని, త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ వెల్లడిస్తామని బోర్డు ప్రతినిధులు చెప్పారు. గత ఏడాది కూడా వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇలాగే న్యూజిలాండ్‌లో ఒక బౌన్సర్‌తో గొడవపడి వివాదాల్లో నిలిచాడు. ఇప్పుడు ఏకంగా కెప్టెనే ఇలాంటి వివాదంలో దొరకడం ఇంగ్లాండ్ క్రికెట్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది.