Indian Womens Cricketer Bharti Fulmali : భారత మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలిపై కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇదేదో ఆమెను గేమ్ గురించి చేస్తోన్న ట్రోల్స్ కాదు. ఆమె లుక్స్ గురించి ట్రోల్ చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం వారందరికీ బ్యాట్​తో అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అసలు ఎవరు ఈ భారతి ఫుల్మాలి? ఆమెను కొందరు నెటిజన్లు ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నారు?

Continues below advertisement

ఎవరు ఈ భారతి ఫుల్మాలి?

భారతి ఫుల్మాలి మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఇండియన్ క్రికెటర్. ఈమె 13 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టి.. 17 ఏళ్లకే సీనియర్ లెవెల్స్​​లో క్రికెట్ ఆడింది. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో విదర్భ మహిళా క్రికెట్ టీమ్​ తరఫున, అలాగే WPLలో గుజరాత్ జెయింట్స్ జట్టు తరఫున ఆడుతున్నారు. ఈమె మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రైట్ హ్యాండ్ బ్యాటర్. అలాగే రైట్ హ్యాండ్ మీడియం పేస్ బౌలర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 

అంచెలంచెలుగా ఎదిగి..

భారతి ఫుల్మాలి దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలతో గుర్తింపు పొంది.. భారత జాతీయ మహిళల జట్టులో అవకాశం దక్కించుకుంది. విదర్భ మహిళా క్రికెట్ టీమ్​లో ముఖ్యమైన ప్లేయర్​గా నిలిచి.. 2023–24 సీజన్‌లో 9 మ్యాచ్‌ల ఆడి 255 పరుగులు సాధించింది. నాలుగు హాఫ్ సెంచరీలతో.. WPL ఫ్రాంచైజీల దృష్టిలో పడింది. 

Continues below advertisement

ఇప్పటివరకు రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. మహిళల క్రికెట్‌లో ఇటీవల కాలంలో ఆమె ఆటతీరును చూసి.. దేశవాళీ క్రికెట్‌తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్​లో సెలక్ట్ చేశారు. కానీ నెటిజన్లు మాత్రం ఆమె లుక్స్​కే పరిమితమైపోయారు. సెలక్టర్లు ఆమె బ్యాట్ పని తీరు చూస్తుంటే.. నెటిజన్లు మాత్రం మగాడాలా ఉన్నావంటూ.. చూసేందుకు వీవీఎస్ లక్ష్మణ్​, పొల్లార్డ్​లా ఉన్నావంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ట్రోల్స్​పై స్పందన.. 

భారతి ఫుల్మాలి తనపై వస్తోన్న ట్రోల్స్​ గురించి పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన లుక్స్​ చూసి జడ్జ్ చేసినప్పుడు చాలా బాధగా ఉంటుందని.. తనకు పాజిటివ్​ కంటే నెగిటివ్ కామెంట్లే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఒక్కోసారి అవి మానసికంగా కూడా కృంగ దీస్తున్నాయని వాపోయారు. ఇదిలా ఉండగా తాజాగా.. ట్రోలర్స్​కి బ్యాట్​తోనే సమాధానం ఇచ్చింది భారతి. వెస్టిండీస్​తో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్​లో 40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ కొట్టి.. 56 నాటౌట్​గా నిలిచింది. 

మహిళల టీ20 ప్రపంచకప్​ ముందు జరిగిన ఈ మ్యాచ్​లో భారతి రాణించడంతో ఆమెకు నెటిజన్లు మద్ధతు పలికారు. ఎవరైతే ఆమెను కామెంట్లు చేస్తున్నారో.. వారికి ఎలాంటి టాలెంట్ లేదని.. వారి మాటలు పట్టించుకోవద్దు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. అయినా క్రికెట్ ఆడటానికి అందం కాదు.. ఆట ముఖ్యం.

"భారతి స్టోరీ చెప్పేది ఒక్కటే.. గ్రౌండ్‌లో నీ బ్యాట్ మాట్లాడాలి, ట్రోల్స్ కామెంట్లు కాదు."సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ ఎదురైనా.. భారతి మాత్రం తన ఆటతోనే సమాధానం ఇస్తోంది. వ్యక్తిగత వ్యాఖ్యల కంటే మైదానంలో ప్రదర్శనే తనకు ముఖ్యమని మరోసారి నిరూపించింది.

గుర్తించుకోవాల్సిన విషయాలు..

ఎవరు మిమ్మల్ని తక్కువగా చూసినా.. మీ పని మీరు చేసుకుంటూ పోతే.. అది కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అందుకే అనవసరమైన విషయాలకు కృంగిపోయి.. మీ గోల్​ని దూరం చేసుకోకండి. మీ పని మీరు చేసుకుంటే.. మీకు జరగాల్సిన పే ఆఫ్​ కచ్చితంగా ఒకరోజు జరుగుతుంది.