BCCI Major Update on Indian Squad: టీమిండియా ఫ్యాన్స్‌కు బిసిసిఐ (BCCI) ఒక ఊహించని షాక్ ఇచ్చింది. అప్కమింగ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను తప్పిస్తున్నట్లు మంగళవారం అనౌన్స్ చేసింది. ఐర్లాండ్‌తో రెండు, ఇంగ్లాండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం సిరాజ్ మొదట సెలెక్ట్ అయ్యాడు. అయితే బిసిసిఐ మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్ డిస్కషన్స్ తర్వాత అతనికి రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. రాబోయే లాంగ్ ఇంటర్నేషనల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు జాగ్రత్తగా ఈ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్లు బోర్డు ఒక స్టేట్‌మెంట్‌లో చెప్పాడు.

Continues below advertisement

Continues below advertisement

Read Also:  FIFA World Cup 2026 Schedule: ఫీఫా ప్రపంచకప్‌లో 48 జట్లు, 104 మ్యాచ్‌లు! ముందెన్నడూ చూడని మెగా ఈవెంట్‌ రెడీ! 

సిరాజ్ ప్లేస్‌లోకి ప్రసిద్ధ్ కృష్ణసిరాజ్ స్థానాన్ని భర్తీ చేయడానికి మెన్స్ సెలెక్షన్ కమిటీ రైట్ ఆర్మ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసింది. రెండు టి20 సిరీస్‌లకు అతను అందుబాటులో ఉంటాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్ 2026 (IPL 2026) సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున సిరాజ్ అన్ని మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. ఆ వెంటనే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్‌లోనూ భాగమయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ మ్యాచులు ఆడటం వల్ల బాడీకి రికవరీ టైమ్ ఇవ్వడానికే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క‌ర్ స్పష్టం చేశాడు. మరోవైపు ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

Read Also: FIFA World Cup 2026 Schedule: ఫీఫా ప్రపంచకప్‌లో 48 జట్లు, 104 మ్యాచ్‌లు! ముందెన్నడూ చూడని మెగా ఈవెంట్‌ రెడీ!

అప్‌డేటెడ్ ఇండియన్ స్క్వాడ్ వివరాలుఈ మార్పు తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు వెళ్లే ఫైనల్ టీమ్ రెడీ అయింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లుగా శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సెలెక్ట్ అయ్యారు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉండగా, పేస్ బాధ్యతలను హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ పంచుకోనున్నారు. జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌కు సిరాజ్‌ను ముందే పక్కన పెట్టడం గమనార్హం.