Rohit And Hardik Cleared Fitness Test Ahead Of Afghanistan ODI Series: ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రానున్నారు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నిర్వహించిన ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌లో వీరిద్దరూ సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయినట్లు ఏఎన్ఐ (ANI) వర్గాలు తెలిపాయి. ఐపిఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో, హార్దిక్ బ్యాక్ స్పాజమ్స్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావడంతో త్వరలోనే వీరు నేషనల్ స్క్వాడ్‌తో కలవనున్నారు.

Continues below advertisement

Read Also: Ben Stokes  News: నైట్‌క్లబ్ రచ్చతో చిక్కుల్లో ఇంగ్లాండ్ కెప్టెన్, సడన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడా!

కోహ్లీ అవుట్, జైస్వాల్‌కి ఛాన్స్స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజూరీ కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి కంప్లీట్‌గా రూల్ అవుట్ అయ్యాడు. ఐపిఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ డిఫెండ్ చేసుకున్న టైంలో కోహ్లీకి ఈ గాయమైంది. కోహ్లీ రికవరీ టైమ్‌లైన్‌పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అప్‌డేట్ ఇచ్చాడు. గాయం జరిగి ఇంకా వారం కూడా కాలేదని, ఫిజియోలు పరిశీలిస్తున్నారని చెప్పాడు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నాటికి కోహ్లీ ఫిట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ, అది కచ్చితమైన సమాధానం కాదని అగార్కర్ స్పష్టం చేశాడు. కోహ్లీ ప్లేస్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.

Continues below advertisement

Read Also: Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్

సిరీస్ షెడ్యూల్, వెన్యూ వివరాలుఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 13 నుంచి వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. మొదటి వన్డే జూన్ 13న ధర్మశాలలో జరుగుతుంది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో, చివరి వన్డే మ్యాచ్ జూన్ 20న చెన్నైలో నిర్వహించనున్నారు. శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నాడు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఈ వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.