Indian Players In Duleep Trophy 2024: సాధారణంగా సిరీస్‌ల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తూ ఉంటే ఫిట్‌నెస్, ఫామ్ కోసం క్రికెటర్లు దేశవాళీలో ఆడుతుంటారు. ఎవరో కొంతమంది స్టార్ క్రికెటర్లకు మాత్రమే అందులో పాల్గొనకుండా వెసులుబాటు దక్కుతుంది. అయితే ఇంతకు ముందు బిసిసిఐ(BCCI) చీఫ్ జై షా(Jai Shah) అన్న మాటల ప్రభావమో , ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వచ్చిన ఫలితమో గానీ టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) బరిలో దిగనున్నారు.
భారత జట్టు ఇటీవల శ్రీలంక(Sri lanka)తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడింది. దీని తర్వాత బంగ్లాదేశ్(Bangladesh)తో టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడనుంది. అయితే శ్రీలంక సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ మధ్యలో దాదాపు 40 రోజుల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ గ్యాప్‌లో, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీతో సహా చాలా మంది భారతీయ స్టార్లు దేశీయ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2024 ఆడటం చూడవచ్చు. నివేదికల ప్రకారం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతాయి.
దీనిబట్టి రోహిత్ శర్మ దాదాపు 9ఏళ్ల తర్వాత డొమెస్టిక్ టోర్నీలో ఆడనున్నాడు. అయితే రోహిత్, కోహ్లీలు సాధారణ జట్ల సభ్యులుగా ఉంటారా, లేదా కెప్టెన్లుగా బరిలో దిగుతారా అన్నదానిపై క్లారిటీ లేదు. రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ను దులీప్ ట్రోఫీలో ఆడనుండగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఉన్నట్లు సమాచారం.
ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వేదికగా నిర్ణయించారు. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి చెందిన స్టేడియం.. ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. సెప్టెంబర్ 5వ తేదీన దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ ట్రోఫీ 22వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా మూడు వారాల పాటు జాతీయ జట్టు క్రికెటర్లు అనంతపురంలో మకాం ఉండబోతోన్నారు. మొదటి రౌండ్ లో లేకపోయినా సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న టోర్నీ రెండో రౌండ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడటం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ లొకేషన్ మార్చనున్నట్టు కూడా సమాచారం. క్రిక్‌బజ్‌లో వచ్చిన కథనం ప్రకారం, వేదికలో మార్పు ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడికి అంతర్జాతీయ విమానాలకు అవకాశం లేకపోవటం కారణం కావచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు అయితే టోర్నీలో ఒక రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ఇండియా ఎ, బి, సి, డి జట్లలో టీమిండియా స్టార్స్ ఆడనున్నారు. దులీప్ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.
Also Read: Paris Olympics 2024: భారత్‌కు ఆ ఏడు పతకాలు వచ్చుంటే, వెంట్రుకవాసిలో చేజారిన పతకాలు