Rishabh Pant : భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మాంచెస్టర్ మైదానంలో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో టెస్ట్ మొదటి రోజున పంత్ కాలికి గాయమైంది. తీవ్ర రక్తస్రావం, నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. వైద్యపరీక్షలు అనంతరం ప్రమాదకరమైన గాయం కాదని తేల్చారు. అయితే మ్యాచ్‌లో కీపంగ్ చేయడానికి వీలుకాదని స్పష్టం చేశారు. దీంతో రెండ రోజు మళ్లీ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చారిత్రాత్మక రికార్డును బద్దలు కొట్టాడు. పంత్ ఒక సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు.

రిషబ్ పంత్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడురిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 75 బంతుల్లో 54 పరుగులు చేసి అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. పంత్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో ఐదో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో ఒక సిరీస్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా పంత్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత్ దిగ్గజ ఆటగాడు

ఫరూక్ ఇంజనీర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది.భారత మాజీ దిగ్గజ ఆటగాడు ఫరూక్ ఇంజనీర్ 1972-73లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు.

భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ ఎంఎస్ ధోనీ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. ధోనీ మొదటిసారిగా 2008-09లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. అదేవిధంగా, 2014లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు.

ఇప్పుడు భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో నాల్గో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ వరకు ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లో పంత్‌కు మూడు ఇన్నింగ్స్‌లు మిగిలి ఉన్నాయి. పంత్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకోవచ్చు.

పంత్ బొటనవేలికి గాయంభారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజున బౌలింగ్‌లో కాలి బొటనవేలికి గాయమైంది. పంత్ స్వీప్ షాట్ ఆడే టైంలో గాయమైంది. బంతి బ్యాట్‌కు తగలడానికి బదులుగా అతని కాలికి తగిలింది. రిషబ్ పంత్ ఈ గాయం కారణంగా బాధపడ్డాడు. పంత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మ్యాచ్ రెండో రోజున పంత్ బ్యాటింగ్ చేయడం కూడా కష్టంగా కనిపించింది, కానీ అతను నొప్పులతోనే బ్యాటింగ్ చేయడానికి వచ్చి చారిత్రాత్మక అర్ధ సెంచరీ సాధించాడు.

నిన్న 35 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయినా రిషబ్‌ పంత్‌ శార్దూల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్‌ వచ్చారు. నెమ్మదిగా ఆడుతూ అర్థసెంచరీ పూర్తి చేశాడు. 75 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యి వెనుదిరిగాడు.