Rishabh Pant : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ రిషబ్‌ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తన కాలి గాయం దిగమింగుతూనే బ్యాటింగ్ చేశాడు. గాయం వల్ల ఇబ్బంది పడుతూనే గ్రౌండ్‌లోకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

314 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ అవుటవ్వడంతో అతని స్థానంలో రిషబ్‌పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు ఇంగ్లండ్ అభిమానులు కూడా లేచి నిల్చొని స్వాగతం పలికారు. 

మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే పంత్ బ్యాటింగ్‌కు వస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అవసరమైతే అతను బ్యాటింగ్‌కు సిద్ధమవుతాడని కూడా తెలిపింది. అయితే కీపింగ్‌కు మాత్రం చేయలేడదని అతని బదులు జురైల్ ఆ విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

భారతదేశం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ వేసిన బంతి పంత్ కాలికి తగిలింది. ఆ ప్రభావం వెంటనే అసౌకర్యానికి దారి తీసింది.  దెబ్బతగిలిన వెంటనే బాధతో గ్రౌండ్‌లో కాసేపు తిరిగిన పంత్ తర్వాత కిందపడిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. అయినా నయం కాలేదు. దీంతో ప్రత్యేక వాహనంలో అతన్ని తరలించారు. అలా వెళ్లడంతో అంతా షాక్ అయ్యారు. అసలు పంత్ మళ్లీ ఆడతాడా అనే అనుమానం కలిగింది. అతను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు బ్యాటింగ్‌కు రావడంతో అభిమానులు హ్యాపిగా ఫీల్ అవుతున్నారు. 

"మాంచెస్టర్ టెస్ట్‌లో మొదటి రోజు కుడి పాదానికి గాయమైన రిషబ్ పంత్, మ్యాచ్‌లోని మిగిలిన ఆటలో వికెట్ కీపింగ్ విధులను నిర్వర్తించబోడు. ధృవ్ జురెల్ వికెట్ కీపర్ పాత్రను పోషిస్తాడు.

"గాయం ఉన్నప్పటికీ, రిషబ్ పంత్ రెండో రోజు జట్టులో చేరాడు. జట్టు అవసరాలకనుగుణంగా బ్యాటింగ్‌కు అందుబాటులో ఉంటాడు." BCCI Xలో ఒక పోస్ట్‌లో తెలిపింది.

పెద్ద ప్రమాదం ఏమీ లేదు!BCCI అధికారిక ప్రకటన ప్రకారం, స్కానింగ్‌లు, వైద్య సహాయం కోసం పంత్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, పెద్ద ప్రమాదం ఏదీ లేదు, కానీ గాయం తీవ్రంగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ దూరంగా ఉంటాడు. 

వికెట్‌ కీపర్‌గా ధ్రువ్ జురెల్మిగిలిన టెస్ట్‌కు ధ్రువ్ జురెల్ ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా అడుగుపెట్టాడు. సిరీస్‌లో ముందుగా అరంగేట్రం చేసిన జురెల్, పంత్ కోలుకునే వరకు ఆ బాధ్యతలు తీసుకుంటాడు. జట్టుకు అవసరమైతే భారతదేశ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ తిరిగి బ్యాటింగ్‌కు రావడానికి అవకాశాలు ఉన్నాయి.  

లోయర్-మిడిల్ ఆర్డర్‌లో పంత్ బ్యాటింగ్ జట్టుకు చాలా సార్లు ఆదుకుంది. మ్యాచ్‌ స్వభావాన్ని మార్చే సత్తా ఉన్న ఆటగాడు. అతని స్ట్రోక్‌ప్లే, ఎదురుదాడి చేసే సామర్థ్యం పంత్ ప్రత్యర్థులకు భయం పుట్టిస్తుంది. ముఖ్యంగా సవాలుతో కూడిన పిచ్‌లపై విలువైన ఆటగాడిగా ఉన్నాడు. అందుకే జట్టు యాజమాన్యం అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుంది,