తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రోజుకో వింత సంఘటన జరుగుతోంది. మొన్న ఒక్క బాల్ కే 18 పరుగులు ఇస్తే.... ఇప్పుడు రివ్యూయింగ్ కే కొత్త విధానాన్ని నేర్పాడు... మన రవిచంద్రన్ అశ్విన్.


దిండిగల్ డ్రాగన్స్ తరఫున ఆడుతున్న అశ్విన్... 13వ ఓవర్ ఆఖరి బాల్ వేశాడు. బ్యాటర్ రాజ్ కుమార్ కీపర్ క్యాచ్ అని అంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ రాజ్ కుమార్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూ చేసిన థర్డ్ అంపైర్.... బ్యాట్ కు బాల్ తగల్లేదని... గ్రౌండ్ కు బ్యాట్ తగలడం వల్ల వచ్చిన సౌండ్ అని... కాబట్టి నాటౌట్ అని తేల్చాడు.


ఇక్కడే డ్రామా మొదలైంది. ఆల్రెడీ డీఆర్ఎస్ ద్వారా తీసుకున్న నిర్ణయాన్నే మళ్లీ రివ్యూ కోరాడు... అశ్విన్. అంటే డీఆర్ఎస్ కే డీఆర్ఎస్ అన్నమాట. ఇలా క్రికెట్ లో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు. సో మళ్లీ థర్డ్ అంపైర్ ఆ ప్రాసెస్ అంతా రిపీట్ చేశాడు. ఎంతైనా బాల్ మారలేదు, టెక్నాలజీ మారలేదు, రివ్యూ చేసే అంపైర్ కూడా మారలేదు. ఇక నిర్ణయం ఎలా మారుతుంది..? రెండోసారి రివ్యూ తర్వాత కూడా బ్యాటర్ ను నాటౌట్ గానే తేల్చారు.