Ashwin comments: ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ..భార‌త ప్లేయ‌ర్ కు ఇచ్చుంటే బాగుండేన‌ని టీమిండియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అభిప్రాయ ప‌డ్డాడు. త‌ను టీమ్ కు ఎక్స్ ఫ్యాక్ట‌ర్ గా ప‌ని చేశాడ‌ని, త‌న వ‌ల్లే టీమ్ ల‌బ్ధి పొందింద‌ని వ్యాఖ్యానించాడు. నిజానికి న్యూజిలాండ్ ఆల్ రౌండ‌ర్ ర‌చిన్ రవీంద్ర‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ అవార్డును ఐసీసీ బ‌హుకరించిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీలో 65.75 స‌గ‌టుతో 263 ప‌రుగులు చేసిన ర‌చిన్.. టోర్నీలో మూడు వికెట్లు తీసి స‌త్తా చాటాడు. అయితే త‌న‌కంటే భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బాగా రాణించ‌డాని, అత‌నికి ఈ అవార్డు ఇస్తే బాగుండేన‌ని వ్యాఖ్యానించాడు. త‌ను జ‌ట్టులో ఉండ‌టంతో టీమిండియా స్పిన్ విభాగం మ‌రింత ప‌టిష్ట‌మైంద‌ని, అత‌ను జ‌ట్టుకు వ్యాల్యూ యాడెడ్ తీసుకొచ్చాడ‌ని అభిప్రాయ ప‌డ్డాడు. ఇక ఈ మెగాటోర్నీకి ముందుగా వ‌రుణ్ ను తీసుకోలేదు. ఇంగ్లాండ్ తో వ‌న్డే సిరీస్ లో విశేషంగా రాణించిన వ‌రుణ్ ను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేశారు. అయితే టోర్నీ తొలి రెండు లీగ్ మ్యాచ్ ల్లో తుది జ‌ట్టులో అవ‌కాశం ల‌భించ‌లేదు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో అవ‌కాశం ద‌క్కించుకున్న వ‌రుణ్ ఐదు వికెట్ల‌తో స‌త్తా చాటి, ఆ త‌ర్వాత జ‌రిగిన సెమీస్, ఫైన‌ల్లో భార‌త జ‌ట్టులో ఆడాడు. 

అద్భుతంగా బౌలింగ్ ..నిజానికి ఫైన‌ల్లో వ‌రుణ్ చ‌క్క‌గా బౌలింగ్ చేశాడ‌ని, స్పిన్ కు అనుకున్నంత అనుకూలించ‌క‌పోయినా, త‌న వేరియేష‌న్ల‌తో జ‌ట్టును ఇబ్బంది పెట్టాడ‌ని అశ్విన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా జ‌ట్టులో కుదురుకుపోయిన, గ్లెన్ ఫిలిఫ్స్ ను అద్భుత‌మైన బంతితో బౌల్డ్ చేశాడ‌ని, మంచి గూగ్లీతో బ్యాట‌ర్ ను ముప్పుతిప్ప‌లు పెట్టాడ‌ని ప్ర‌శంసించాడు. త‌ను క‌నుక జ‌డ్జిగా ఉన్న‌ట్ల‌యితే క‌చ్చితంగా వ‌రుణ్ నే ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపిక చేసేవాడిన‌ని, త‌న ఆట‌తీరుతో అలాంటి ముద్ర వేశాడ‌ని కొనియాడాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడేళ్ల కింద‌ట తొలిసారి 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ద్వారా తొలి ఐసీసీ టోర్నీ ఆడాడు. అది అత‌నికి పీడ‌క‌ల‌గా మారింది. ఆ త‌ర్వాత క‌ఠోర ప్రాక్టీస్ ద్వారా మ‌ళ్లీ మూడేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి వ‌చ్చి, ముందుగా టీ20లు, ప్ర‌స్తుతం వ‌న్డేల్లో పాతుకుపోయాడు. 

సూప‌ర్ కంబ్యాక్..ఇక ఈ మెగా టోర్నీలో భార‌త జ‌ట్టు అంచ‌నాల‌కు మించి రాణించింద‌ని అశ్విన్ పేర్కొన్నాడు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్ర‌ణాళిక‌లు సత్ఫ‌లితాల‌ను ఇచ్చాయ‌ని కొనియాడు. ఈ టోర్నీకి ముందు టీమిండియా సినీయ‌ర్లు చాలా ఒత్తిడిలో ఉన్నార‌ని, అలాగే కీల‌క పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా జ‌ట్టుకు దూర‌మైనా, భార‌త్ విజ‌యం సాధించించిన గుర్తు చేశాడు. బార‌త కంబ్యాక్ ఇత‌ర జ‌ట్ల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని పేర్కొన్నాడు. ఇక మెగాటోర్నీని రికార్డు స్థాయిలో మూడోసారి టీమిండియా ద‌క్కించుకుంది. గ‌తంలో 2002, 2013 టోర్నీల‌ను నెగ్గిన టీమిండియా, 2025లో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంగా మూచ్చ‌ట‌గా మూడోసారి విజేత‌గా నిలిచింది. గ‌తంలో ఆసీస్ మాత్ర‌మే రెండుసార్లు ఈ టోర్నీని ద‌క్కించుకుంది.