దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోపీ(Ranji Trophy )లో కేరళ-ముంబై Kerala- Mumbai )మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నయా స్టార్‌ శివమ్ దూబే మెరిశాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచి మంచి ఫామ్‌లో ఉన్న దూబే(Shivam Dube)టెస్టు క్రికెట్‌లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. అఫ్గానిస్తాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో దూబే వరుస అర్ధ శతకాలు సాధించాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన దూబే.. టీమిండియా సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. కీలక సమయాల్లో రెండు వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అఫ్గాన్‌తో టీ 20 సిరీస్‌ ముగిసిన వెంటనే.. ముంబై జట్టులో చేరిన శివమ్ దూబే... జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆదుకున్నాడు. 


మ్యాచ్‌ ఎలా సాగిందంటే...?
రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా కేరళ- ముంబై మధ్య మ్యాచ్‌ మొదలైంది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ అజింక్య రహానే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ గెలిచిన ముంబై అలా బ్యాటింగ్‌కు దిగిందో లేదో ఇలా వికెట్‌ కోల్పోయింది. కేరళ బౌలర్ బాసిల్ థంపీ వేసిన తొలి బంతికే ఓపెనర్‌ జై గోకుల్‌ బిస్తాను అవుట్‌ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ రహానేను కూడా గోల్డెన్‌ డక్‌ చేశాడు. ఇలా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సువేద్‌ పార్కర్‌ 18, ప్రసాద్‌ పవార్‌ 28 పరుగులు చేసి అవుటవ్వడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందని భావించారు. కానీ ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శివం దూబే.. లల్వానీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. లల్వానీ 50 పరుగులు, దూబే 51, తనూష్‌ కొటైన్‌ 56 పరుగులతో రాణించడంతో  ముంబై తొలి రోజు ఆట ముగిసే సరికి 78.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్‌ అయింది.
హైదరాబాద్‌ భారీ స్కోరు



దేశవాళి  ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ జట్టు.. మూడో మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. అఫ్గాన్‌తో టీ 20 సిరీస్‌ సందర్భంగా హైదరాబాద్‌ జట్టును వీడిన తిలక్‌ వర్మ... తిరిగి జట్టులో చేరడంతో హైదరాబాద్‌ పటిష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సిక్కిం బ్యాటింగ్‌కు దిగింది. ఇదే ఎంత తప్పుడు నిర్ణయమో సిక్కిం జట్టుకు వెంటనే తెలిసొచ్చింది. హైదరాబాద్‌ బౌలర్లు త్యాగరాజన్‌ ఆరు వికెట్లు, సీవీ మిలింద్‌ నాలుగు వికెట్లతో చెలరేగడంతో సిక్కిం కేవలం 79 పరుగులకే ఆలౌట్‌ అయింది. వీరిద్దరి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిక్కిం జట్టు తీవ్రంగా కష్టపడింది.  తొలిరోజు ఆట ముగిసే సరికి వీరిద్దరు అజేయంగా నిలవగా.. హైదరాబాద్‌ ఏకంగా 302 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.