ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌(Film Maker) విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా(Agni Chopra) దేశవాళి ప్రతిష్టాత్మ టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో చెలరేగిపోతున్నాడు. వరుసగా సెంచరీలు బాదేస్తూ టీమిండియా(Team India)లో స్థానం సంపాదించే దిశగా దూసుకెళ్తున్నాడు. రంజీ ట్రోఫీ అరంగేట్ర  సీజన్‌లోనే ఇప్పటివరకు ఐదు సెంచరీలు బాదాడు. మిజోరం తరఫున ఆడుతున్న  అగ్ని చోప్రా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 


మేఘాలయాతో మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో అగ్ని చోప్రా ఏకంగా రెండు ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలతో మెరిశాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అగ్నికి ఇది ఐదో సెంచరీ.  ఈ ఏడాది రంజీలలోకి అరంగేట్రం చేసిన అగ్ని.. సిక్కీంతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 166, రెండో ఇన్నింగ్స్‌లో 92  పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో నాగాలాండ్‌తో 164, 15 రన్స్‌ చేయగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో 114, 10 పరుగులు సాధించాడు. మేఘాలయాతో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలూ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 105, 101 శతకాలతో మెరిశాడు. నాలుగు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలోనే అగ్ని ఐదు సెంచరీలు చేసి దేశవాళీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు.


స్పందించిన అగ్ని తల్లి
అగ్ని చోప్రా వరుస శతకాలతో దేశవాళీ క్రికెట్‌లో అతడి పేరు మార్మోగిపోతుండండపై అగ్ని చోప్రా తల్లి అనుపమ్‌ చోప్రా స్పందించారు. కుమారుడి రికార్డుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ‘‘తల్లిగా గర్విస్తున్నా’’అని క్యాప్షన్‌ పెట్టారు. ఇదే జోరు సీజన్‌ ఆసాంతం కొనసాగిస్తే అగ్ని చోప్రా రాబోయే రెండు మూడేండ్లలో భారత జట్టులో పోటీ పడే అవకాశముందని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.


అగ్ని చోప్రా అదుర్స్‌
విధు వినోద్‌ చోప్రా కుమారుడు అగ్ని చోప్రా(Agni Chopra) రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత శతకం సాధించి తన సత్తా చాటాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 కుర్రాడు సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో179 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 166 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 74బంతుల్లో 92 పరుగులు చేసి అబ్బుర పరిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో మిజోరం నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అగ్ని చోప్రా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 164 పరుగులు చేసి మరోసారి భారీ శతకం సాధించాడు. దీంతో మిజోరం 356 పరుగులకు ఆలౌటైంది.


రెండు మ్యాచ్‌లో...
రంజీ ట్రోఫీలో భాగంగా మిజోరం తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.. వరుసగా రెండు సెంచరీలు చేశాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో సిక్కీంతో తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 166, రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన అగ్ని చోప్రా... నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శతకంతో మెరిశాడు. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చోప్రా.. 150 బంతుల్లో 21 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సాయంతో 164 పరుగులు చేశాడు.