Vidarbha beat MP to set up blockbuster final vs Mumbai: దేశవాళీ ప్రతిష్టాత్మక ట్రోఫీ రంజీ ట్రోఫీ ఫైనల్లోకి(Ranji Trophy Final 2024) విదర్భ(Vidarbha) దూసుకెళ్లింది. పేసర్లు ఆదిత్య థాకరే , యశ్‌ ఠాకూర్‌ చెలరేగడంతో విదర్భ ఫైనల్‌లో చేరింది. ఇక ఫైనల్లో ముంబైతో తుదిపోరులో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. విదర్భ 62 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. 4 వికెట్లు చేతిలో ఉండగా మధ్యప్రదేశ్‌ విజయానికి 93 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ జట్టు మరో 30 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి  228 పరుగులతో బుధవారం ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌ 81.3 ఓవర్లలో 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆదిత్య థాకరే.. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కుమార్‌ కార్తికేయ (0)తో పాటు అనుభవ్‌ అగర్వాల్‌ (0)లను వరుస ఓవర్లలో ఔట్‌ చేసి విదర్భను విజయానికి చేరువ చేశాడు. మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు సారాంశ్‌ జైన్‌ (25)ను యశ్‌ బౌల్డ్‌ చేయడంతో మధ్యప్రదేశ్‌ ఓటమి ఖాయమైపోయింది. కాసేపటికే చివరి బ్యాటర్‌ కుల్వంగ్‌ కెజ్రోలియా (11)ను ఔట్‌ చేసిన యశ్‌ ఆ జట్టు కథ ముగిసించాడు. ఈ నెల 10న ముంబైలో వాంఖడేలో ప్రారంభమయ్యే ఫైనల్లో విదర్భ.. ముంబైతో తలపడుతుంది. 


ఇప్పటికే ఫైనల్లో ముంబై
రంజీ ట్రోఫీలో భాగంగా ముంబ‌య్(Mumbai) ఫైన‌ల్ చేరింది. త‌మిళ‌నాడుతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 70 ప‌రుగుల‌తేడాతో జ‌య‌భేరి మోగించింది. బౌల‌ర్ల ఆధిప‌త్యం న‌డిచిన ఈ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగియ‌డం విశేషం. 3 ఇన్నింగ్స్ ల్లో క‌లిపి 18 మంది బ్యాట్స్‌మెన్‌ సింగిల్ డిజిట్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారంటే బౌల‌ర్లు ఎలా చెల‌రేగారో అర్ధ‌మ‌వుతోంది. రంజీట్రోఫీ లోముంబ‌య్ ఫైన‌ల్ లో ప్ర‌వేశించ‌డం ఇది 48వ సారి. సోమ‌వారం ముంబ‌య్‌లో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 
సెమీస్‌లో టాస్ గెలిచిన త‌మిళ‌నాడు బ్యాటింగ్ ఎంచుకొంది. కానీ పిచ్ కండీష‌న్ ని గుర్తు చేస్తూ ఇన్నింగ్స్ నాలుగో బంతినే వికెట్ గా మ‌లిచాడు శార్ధూల్ ఠాకూర్. త‌మిళ‌నాడు ఓపెన‌ర్‌సాయి సుద‌ర్శ‌న్ య‌ల్బీ గా వెనుదిరిగాడు. త‌రువాత జ‌గ‌దీశ‌న్‌, ప్ర‌దోష్‌పాల్‌, సాయికిషోర్‌, ఇంద్ర‌జిత్ త‌క్కువ స్కోర్ల‌కే పెవిలియ‌న్ చేరారు. దీంతో ఆట మొద‌ల‌యిన గంట‌లోపే 5 వికెట్లు కోల్పోయి త‌మిళ‌నాడు 100 ప‌రుగుల‌యినా చేస్తుందా అనిపించింది.
ఇక అప్పుడు క్రీజులోకొచ్చిన విజ‌య్‌శంక‌ర్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు. 44 ప‌రుగుల‌తో విజ‌య్‌శంక‌ర్‌, 43 ప‌రుగుల‌తో వాషింగ్ట‌న్ సుంద‌ర్ జ‌ట్టును ఆదుకొన్నారు. సింగిల్స్ తీస్తూనే వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. అప్ప‌టికే కీల‌క వికెట్లు కోల్పోయిన త‌మిళ‌నాడు ని  విజ‌య్ శంక‌ర్ 44,  ఆదుకోక పోతే జ‌ట్టు స్కోరు 100 ప‌రుగులు కూడా దాటేది కాదు. ఇక ఈ జంట ప్ర‌మాద‌క‌ర‌మ‌వుతుంది అనుకొన్న ద‌శ‌లో శార్ధూల్ విజ‌య్‌శంక‌ర్ వికెట్ తీసాడు. త‌నుష్ కొటియ‌న్ సుంద‌ర్ ని పెవిలియ‌న్ చేర్చాడు. ఇక మిగిలిన త‌మిళ‌నాడు వికెట్లు తీయడం ముంబ‌య్ బౌల‌ర్ల‌కు పెద్ద‌గా క‌ష్ఠం కాలేదు. దీంతో త‌మిళ‌నాడు తొలి ఇన్నింగ్స్‌లో 64.1 ఓవ‌ర్ల‌లో 146 ప‌రుగుల‌కే ఆలౌటైంది.