Pujara Runs Ranji Trophy 2024:  స్పెష‌లిస్ట్ టెస్ట్‌ బ్యాటర్ అయిన పూజారా 243 ర‌న్స్‌తో విరుచుకుప‌డ్డాడు. ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్‌ (World Test Championship)లో బ్యాటింగ్‌లో విఫలమై జ‌ట్టుకు దూర‌మైన నయావాల్ Pujara ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశ‌త‌కం న‌మోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల‌ సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్టర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌల‌ర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. తొలి మ్యాచ్‌లోనే ద్వి శతకం చేయడం విశేషం. ఈ డబుల్‌ సెంచరీతో చెలరేగిన పుజారా  అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. 

 

పుజారా రికార్డులు

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక డబుల్‌ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా  నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్‌ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (Don Bradman) 37 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా 19, 730 రన్స్‌తో రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ 19,729ను పుజారా అధిగమించాడు. 

 

ఇంగ్లండ్‌తో రీ ఎంట్రీ

తాజా డబుల్ సెంచరీతో పుజారా ఎంపిక విషయమై కూడా సెలెక్టర్లు చర్చించనున్నారు. అతడి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పుజారాకు జట్టులో చోటు కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల చివరి నుంచి భారత్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు సెలెక్టర్లు త్వరలోనే టీమిండియా స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు. పుజారా చివరగా భారత జట్టుకు గత జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 

పుజారా భారీ ద్వి శతకం

స్పెష‌లిస్ట్ టెస్ట్‌ బ్యాటర్ అయిన పూజారా 243 ర‌న్స్‌తో విరుచుకుప‌డ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ వైఫ‌ల్యంతో జ‌ట్టుకు దూర‌మైన నయావాల్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశ‌త‌కం న‌మోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల‌ సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్ట‌ర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌల‌ర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరో సౌరాష్ట్ర ఆటగాడు ప్రేర‌క్ మ‌న్కడ్ కూడా శతకం చేయడంతో సౌరాష్ట్ర 5784 వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

హైదరాబాద్‌ భారీ విజయం

రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభించింది. రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీ... కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్‌... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసింది. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి నాగాలాండ్‌ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ గుర్తింపు పొందాడు.