పాతాళం నుంచి పతాకస్థాయికి..
ఒకప్పుడు భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, కోర్టు సమన్లు ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు రోడ్డు ప్రమాదం ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గలేదు. ఇంకా దృఢంగా తయారయ్యాడు. చాలాకాలం వరకు జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపో లేదు. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన కుటుంబం గురించి మీడియా తో పంచుకున్నాడు. తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. కుటుంబ విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపాడు. ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నాడు. బెంగాల్ తరపున మహమ్మద్ షమీ సోదరుడు మహమ్మద్ రంజీ అరంగేట్రం చేశాడు. షమీ లాగే కైఫ్(Mohammed Kaif)కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో మక్కువ. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో సాగుతుండటం చూసిన కైఫ్ స్ఫూర్తి పొందాడు. స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే కైఫ్ కల నెరవేరే దిశగా షమీ అండగా నిలుస్తున్నాడు.
IPL 2024: ఐపీఎల్‌కు మరో ఇద్దరు స్టార్లు దూరం, బీసీసీఐ అధికారిక ప్రకటన
ABP Desam
Updated at:
13 Mar 2024 08:27 AM (IST)
Edited By: Jyotsna
BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం ప్రారంభంకానున్న వేళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. స్టార్ బౌలర్ మహ్మద్ షమి, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ కు దూరం.
ఐపీఎల్‌కు మరో ఇద్దరు స్టార్లు దూరం ( Image Source : Twitter )
NEXT
PREV
Prasidh Krishna and Shammi: మరో ఎనిమిది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమరం ప్రారంభంకానున్న వేళ గుజరాత్ టైటాన్స్(Gujarat titans), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కుడికాలి చీలమండకు సర్జరీ చేయించుకున్న రికవరీ అవుతున్న గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమి(Mohammed Shami ) ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. ఎడమ కాలి మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న రాజస్థాన్ రాయల్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ( Prasidh Krishna) కూడా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు వెల్లడించింది. గత నవంబరులో ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి మ్యాచ్ ఆడిన 33 ఏళ్ల షమీకి... గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా అందుబాటులోకి రాలేదు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‍లోనూ ఆడలేదు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ అది కూడా సాధ్యం కాదని ఇప్పుడు బీసీసీఐ ప్రకటనతో తేలిపోయింది.
Published at:
13 Mar 2024 08:27 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -