KL Rahul: ఆసియా కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో అతడు ఆసియా కప్‌లో భారత్ ఆడబోయే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా వెల్లడించాడు.
మంగళవారం రాత్రి భారత జట్టు శ్రీలంకకు బయల్దేరనున్న నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్రికేయులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ద్రావిడ్.. ‘కెఎల్ రాహుల్ ప్రొగ్రెస్ బాగుంది. కానీ అతడు ఆసియా కప్‌లో భారత్ ఆడబోయే పాకిస్తాన్, నేపాల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు’అని తెలిపాడు.
ఐపీఎల్ - 16లో తొడ కండరాల గాయంతో సర్జరీ చేయించుకున్న రాహుల్.. రెండు నెలలుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లోనే రీహాబిటేషన్ పొందుతున్నాడు. ఇటీవలే పూర్తిస్థాయిలో కోలుకున్న రాహుల్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లోనే ఎంపికవుతాడని ఆశించినా అలా జరుగలేదు. ఆసియా కప్‌లో జట్టుకు ఎంపికైన కెఎల్.. అలూరులో నిర్వహిస్తున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లో కూడా ప్రాక్టీస్ చేశాడు. కొద్దిరోజుల క్రితమే భారత ఆటగాళ్లందరికీ యో యో టెస్టు నిర్వహించగా రాహుల్‌కు మాత్రం ఇంకా అది పూర్తికాలేదు. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోవడంతో రాహుల్, వారం రోజుల తర్వాత టీమిండియాతో కలువనున్నాడని ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. రాహుల్ తో పాటే ఎన్‌సీఏలో రీహాబిటేషన్ పొందిన శ్రేయాస్ అయ్యర్ మాత్రం పూర్తిస్థాయిలో కోలుకుని మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఆసియా కప్‌లో భారత్.. తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 02న పాకిస్తాన్‌తో ఆడనుంది. పల్లెకెల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న నేపాల్‌తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్ ల తర్వాత సూపర్ - 4 మొదలుకానుంది. సూపర్ - 4 స్టేజ్ వరకైనా రాహుల్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్ ఇప్పుడు కోలుకోకుంటే అక్టోబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఎంపికవడం కూడా అనుమానంగానే మారనుంది.
ఆసియా కప్‌కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ - రిజర్వు ఆటగాడు: సంజూ శాంసన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial