Rahane Sent Jaiswal Off Field:  మాజీ క్రికెటర్ అజింక్యా రహానే, ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్‌లో చేసిన సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి. బిసిసిఐ ప్రశంసించినట్లుగానే రహానే తన కేరియర్‌లో ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూల్‌గా డెసిషన్లు తీసుకున్నాడు. 2022లో వెస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రహానే తీసుకున్న ఒక డెసిషన్ యశస్వి జైస్వాల్ కేరియర్‌ను కాపాడింది. సౌత్ జోన్ బ్యాటర్ టి రవి తేజతో జైస్వాల్ కంటిన్యూయస్‌గా స్లెడ్జింగ్‌కి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవ్వడంతో అంపైర్లు రహానేతో మాట్లాడారు. 

Continues below advertisement

Continues below advertisement

మైదానం నుంచి బయటకు పంపిన రహానే.. జైస్వాల్ రియాక్షన్పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన రహానే, జైస్వాల్‌ను శాంతపరచడానికి ట్రై చేశాడు. అయినప్పటికీ జైస్వాల్ మాట వినకుండా రవి తేజతో వాగ్వాదానికి దిగాడు. దాంతో రహానే ఏమాత్రం ఆలోచించకుండా జైస్వాల్‌ను మైదానం నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. జైస్వాల్ ముఖం చిన్నబుచ్చుకుని గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. స్లెడ్జింగ్ గేమ్‌లో పార్ట్ అయినప్పటికీ అది లిమిట్స్ దాటకూడదని రహానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు.

Read Also: Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్! 

మ్యాచ్ రిఫరీ సంచలన నిర్ణయం.. 4 మ్యాచ్ ల బ్యాన్ లెటర్ చింపేసిన వైనంఈ ఇన్సిడెంట్ తర్వాత మ్యాచ్ రిఫరీ వెంగలిల్ నారాయణన్ కుట్టి, రహానే వద్దకు వచ్చి ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. జైస్వాల్ ప్రవర్తనకు అతడిపై 4 మ్యాచ్ ల బ్యాన్ విధిస్తూ ఆల్రెడీ ఆర్డర్ లెటర్ రెడీ చేశానని రిఫరీ చెప్పాడు. అయితే కెప్టెన్ గా రహానే జైస్వాల్‌ను వెంటనే గ్రౌండ్ నుంచి పంపించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో ఆ లెటర్‌ను రహానే ముందే చింపేశాడు.

జైస్వాల్ కెరీర్ ను కాపాడిన రహానే సమయస్ఫూర్తిరహానే ఆ రోజు తీసుకున్న డెసిషన్ వల్ల జైస్వాల్ బ్యాన్ నుంచి తప్పించుకుని నేడు ఇండియా టీమ్ లో కింగ్ లాగా రాణిస్తున్నాడు. "జైస్వాల్ టాప్ క్వాలిటీ ప్లేయర్, అతని క్రెడిట్ నేను తీసుకోను. కానీ ఆ రోజు బ్యాన్ పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు" అని రహానే తెలిపాడు. రహానే సమయస్ఫూర్తి వల్ల ఒక యంగ్ స్టార్ కేరియర్ నాశనం కాకుండా కాపాడాడ‌ని నిపుణులు అంటున్నారు.