Sai Sudharsan Ruled Out Lanka Series:  శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి ముందు టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. కాలి గాయం నుంచి రికవర్ కాకపోవడంతో యంగ్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి కంప్లీట్ గా రూల్ అవుట్ అయినట్లు స‌మాచారం. టీమ్ ఇండియాలో నంబర్ 3 పొజిషన్ లో ఆడుతున్న సుదర్శన్ లేకపోవడంతో ఆ ప్లేస్ లో దేవదత్ పడిక్కల్ మైదానంలోకి దిగే ఛాన్స్ ఉంది. కొలంబోలో శ్రీలంక ఎలెవన్ తో జరుగుతున్న త్రీ-డే వార్మప్ మ్యాచ్ లో పడిక్కల్ బిగ్ సెంచరీతో మెప్పించాడు. దీంతో అత‌డికి ప్లేయింగ్ లెవ‌న్ లోకి బ‌రిలోకి దిగేందుకు మార్గం సుగ‌మం అయ్యింది.

Continues below advertisement

Continues below advertisement

సీఓఈ లో ట్రెయినింగ్ తీసుకున్నా కోలుకోని సుదర్శన్.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో సాయి సుదర్శన్ బ్యాటింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్ లో పాల్గొంటూ రీహాబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా స్టార్ట్ కాబోయే ఫస్ట్ టెస్ట్ సమయానికి అతడు ఫుల్ ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ లేదని బిసిసిఐ సీఓఈ మెడికల్ స్టాఫ్ కన్ఫర్మ్ చేసింది. దాంతో సుదర్శన్ ఈ టూర్ కి దూరం కాగా, త్వరలోనే సెలెక్టర్లు రీప్లేస్‌మెంట్ ను అనౌన్స్ చేయనున్నారు.

ఆగస్టు 4న జట్టుతో వెళ్లని సుదర్శన్.. పడిక్కల్ కి మైండ్ బ్లాకింగ్ ఆఫర్ఆగస్టు 4న టీమ్ ఇండియా శ్రీలంక బయలుదేరినప్పుడు సుదర్శన్ కొలంబో ట్రావెల్ చేయలేదు. శనివారం టీమ్ తో జాయిన్ అవుతాడని అనుకున్నా, డోక్టర్ల సలహాతో టూర్ నుంచి తప్పుకున్నాడు. రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్-ఆఫ్ టెస్ట్ లో ఆడిన సుదర్శన్, తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 383 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పడిక్కల్ వార్మప్ మ్యాచ్ లో చూపించిన ఫార్మ్ తో సుదర్శన్ ప్లేస్ ను భర్తీ చేయడానికి రెడీ అయ్యాడు.

గిల్ వేలి గాయం టెన్షన్.. కంటిన్యూ అవుతున్న ప్లేయర్ల ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్మరోవైపు ప్రాక్టీస్ సెషన్ లో కుడిచేతి వేలికి గాయం కావడం వల్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వార్మప్ మ్యాచ్ ఫస్ట్ డే, సెకండ్ డే ఆటలో పాల్గొనలేదు. ఆల్రెడీ జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లు గాయాలతో ఈ సిరీస్ కి దూరమయ్యారు. ఇప్పుడు సాయి సుదర్శన్ కూడా అవుట్ అవ్వడంతో మేనేజ్‌మెంట్ కి బిగ్ హెడేక్ గా మారిందని తెలుస్తోంది.