Punjab Kings Player Jitesh Sharma On IPL: ఐపీఎల్ 2023 సీజన్ పంజాబ్ కింగ్స్‌కు నిరాశను అందించింది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కానీ పంజాబ్ కింగ్స్ యువ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పెద్ద షాట్లు సైతం అలవోకగా కొట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో జితేష్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 309 పరుగులు సాధించాడు. ఈ సమయంలో జితేష్ శర్మ స్ట్రైక్ రేట్ ఏకంగా 156గా ఉంది. అలాగే అతను టోర్నమెంట్‌లో 21 సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు.


'రోజుకు 400 సిక్సర్లు'
పంజాబ్ కింగ్స్ ఆటగాడు జితేష్ శర్మ తన ఇటీవలి ఇంటర్వ్యూలలో తన విజయ రహస్యాన్ని చెప్పాడు. జితేష్ శర్మ మాట్లాడుతూ, ‘నేను ఎప్పుడూ 18వ లేదా 19వ ఓవర్ జరుగుతుందనే మైండ సెట్‌తోనే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తాను. నేను ప్రతిరోజూ నెట్స్‌లో దాదాపు 400 సిక్సర్లు కొట్టేవాడిని.’ అని చెప్పాడు. ఒక్కో సెషన్‌కు 40 బంతుల చొప్పున 10 సెషన్లు ఆడేవాడిని అని చెప్పాడు. అంతే కాకుండా మధ్యలో 30 నిమిషాల విరామం తీసుకుంటానని పేర్కొన్నాడు.


దీంతో పాటు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్‌ గురించి జితేష్ శర్మ మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో వసీం జాఫర్ ఉండటం అద్భుతంగా ఉందని జితేష్ శర్మ అన్నారు. తనకు వసీం జాఫర్‌ వ్యక్తిగతంగా తెలుసని, తన ఆలోచనా విధానం వసీం జాఫర్‌కు కూడా బాగా తెలుసని తెలిపాడు. దీనివల్ల మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా సులభం అయిందని, ఇది మంచి విషయం అని పేర్కొన్నాడు.


‘క్రికెటర్ కావాలనుకోలేదు’
తాను క్రికెటర్‌ని కావాలని ఎప్పుడూ కోరుకోలేదని జితేష్ శర్మ చెప్పాడు. తాను ఎప్పుడూ ఇండియన్ ఆర్మీ వైపే మొగ్గు చూపేవాడిని అన్నాడు. దీని వల్లే తను క్రికెట్‌లోకి వచ్చానని, తద్వారా భారత ఆర్మీకి నాలుగు శాతం ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగానని చెప్పాడు. కానీ తర్వాతి కాలంలో క్రికెట్ తన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిందని పేర్కొన్నాడు.


దేశవాళీ క్రికెట్లో జితేశ్‌ శర్మకు అనుభవం ఉంది. ప్రస్తుతం విదర్భకు వికెట్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. మిడిలార్డర్లో వచ్చి బంతిని బలంగా బాదగలడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో విధ్వంసాలు సృష్టించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. తన అరంగేట్రం మ్యాచుల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 17 బంతుల్లోనే 26 బాదేసి ఔరా అనిపించాడు. తనకు 5, 6 స్థానాల్లో వచ్చి పవర్ హిట్టింగ్‌ చేయగల సామర్థ్యం ఉంది. 2023 ఐపీఎల్ సీజన్‌లో 156 స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 49 నాటౌట్‌గా ఉంది.


2014 ఫిబ్రవరి 27వ తేదీన జితేశ్‌ విదర్భ తరఫున లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2013-14 సీజన్లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. 2018-19 విజయ్‌ హజారే ట్రోఫీలో 7 మ్యాచుల్లోనే 298 పరుగులు చేశాడు. తన జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ప్రదర్శన నచ్చడంతో గతేడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది రంజీల్లోనూ అడుగుపెట్టనున్నాడు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial