T20 World Cup: ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో అంతా చూస్తున్నాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్‌లను ఆస్ట్రేలియాకు గెలిపించిన ప్యాట్ కమిన్స్...ఐపీఎల్‌కి ఆడుతూ SRH కెప్టెన్ చేస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న అన్ని టీమ్స్ సిద్ధమవుతున్న టైమ్‌లో ఆస్ట్రేలియా ఈసారి మిచ్ మార్ష్ నేతృత్వంలో వరల్డ్ కప్‌కి రెడీ అవుతోంది. 


అయితే ప్యాట్ కమిన్స్ గురించి తెలుసుగా బాగా సౌండ్ చేస్తున్న టీమ్స్‌ని సైలెంట్ చేసి సైలెన్సర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా మీద కూడా అలాంటి కాన్ఫిడెంట్ స్టెట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరల్డ్ కప్‌లో సెమీస్ ఆడే అవకాశం ఉన్న నాలుగు జట్లు పేర్లు చెప్పమంటే ఆస్ట్రేలియా కచ్చితంగా ఉంటుంది అన్నాడు. ఓకే మిగిలిన మూడు టీమ్స్ ఏం రావొచ్చు అంటే ఏమొచ్చినా పర్లేదు అన్నాడు. అలా కాదు ఏవైనా మూడు టీమ్స్ పేర్లు చెప్పండి అన్నాడు. మీరు ఎవరైనా తెచ్చుకోండి ఎవరైనా రమ్మనండి ఆస్ట్రేలియా అటు వైపు ఉంటుంది అన్నాడు. 


ఇది వాళ్ల గేమ్ మీద వాళ్లకున్న కాన్ఫిడెన్స్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు వాళ్లు అదే హండ్రెండ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ అన్నీ వరుసగా గెలుస్తున్నారని రీసెంట్‌గా ఆస్ట్రేలియా ఫర్ ఫార్మెన్స్ చూస్తేనే అర్థమవుతోంది. మరి ప్యాట్ కమిన్స్ ఇంత కాన్ఫిడెంట్ చెప్పిన స్టేట్మెంట్‌ని నిజం చేసేలా ఆస్ట్రేలియా సెమీస్‌కి వెళ్తుందా ఒక వేళ భారత్ లాంటి టీమ్ ఎదురైతే నాకౌట్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా భారత్ ఎలా ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలంటే మరో ఇరవై రోజులు ఆగాల్సిందే.


 టీ 20 వరల్డ్ కప్‌ ఆడే  ఆస్ట్రేలియా జట్టు ఇదే  


మిచెల్ మార్ష్‌ కెప్టెన్సీలో ఆడే 15 మంది టీంను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మధ్యకాలంలోనే ప్రకటించింది. ఈ జట్టులో చాలా మంది సీనియర్లకు చోటు లభించలేదు. అందులో స్టీవ్ స్మిత్ ఒకరు. ఆయన ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్న బోర్డు తుది జట్టులోకి తీసుకోలేదు. ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్న జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌ గుర్క్‌కి జట్టులో చోటు దక్కలేదు. అలాంటిది ఏ మాత్రం ఫామ్‌లోని డేవిడ్ వార్నర్‌ను ఆడిస్తున్నారు. 2021 టీ 20 వరల్డ్ కప్‌ సాధించిన జట్టులోని వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారిలో 11 మందికి చోటు దక్కింది. 


జట్టు ఇదే 
మిచెల్ మార్ష్‌, ట్రావిన్స్‌ హెడ్, డేవిండ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరాన్ గ్రీన్, టిమ్‌డేవిడ్‌, ఆస్టాన్ అగర్‌, మాథ్యూ వేడ్‌, జోష్ ఇంగ్లిష్, నాథన్‌ ఎల్లిస్, మార్కస్‌ స్టోయినిస్, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్ స్టార్క్, జోష్ హేజెల్‌ వుడ్, ఆడమ్ జంపా