Rishabh Rebuilds Ancestral Roots:  ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ జిల్లాలోని పాలి-అమ్దాలీ గ్రామంలో విలేజర్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తల్లి సరోజ్ పంత్ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆగస్టు 4న గ్రామానికి వచ్చి ఐదు రోజులు ఉంది. శిధిలావస్థలో ఉన్న తమ పూర్వీకుల పాత ఇంటిని రీకన్స్ట్రక్షన్ చేయడానికి కాంట్రాక్టర్‌ను కుదుర్చుకుంది. ఈ ఇల్లు రెడీ అయితే రిషభ్ పంత్ రెగ్యులర్ గా గ్రామానికి వస్తాడని స్థానికులు భావిస్తున్నారు.

Continues below advertisement

Continues below advertisement

60 ఏళ్ల క్రితం గ్రామం వదిలిన తాత.. 7 ఏళ్ల వయసులో ఊరొచ్చిన పంత్పంత్ తాత ఉద్యోగం కోసం 60 ఏళ్ల క్రితం గ్రామాన్ని వదిలి రూర్కీలో సెటిల్ అయ్యాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం పంత్ ఏడేళ్ల చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతడిని గ్రామానికి తీసుకొచ్చాడని బంధువులు గుర్తు చేసుకున్నారు. పంత్ బాబాయ్ మదన్ మోహన్ పంత్ మాట్లాడుతూ "రిషభ్ తల్లి ఇంటి పునర్నిర్మాణం స్టార్ట్ చేయించింది. ఇల్లు పూర్తయ్యాక రిషభ్ గ్రామంలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నాడు. 

సీఎంను ల్యాండ్ కోరిన పంత్.. పాజిటివ్ గా రెస్పాండ్ అయిన ధామీఢిల్లీ నుంచి తన బేస్ ను ఉత్తరాఖండ్‌కి మార్చడానికి ల్యాండ్ అక్విజిషన్‌లో హెల్ప్ చేయాలని పంత్ రీసెంట్ గా ఎక్స్ వేదికగా సీఎం పుష్కర్ సింగ్ ధామీని రిక్వెస్ట్ చేశాడు. పంత్‌ను రాష్ట్ర గర్వకారణంగా అభివర్ణించిన సీఎం, రూల్స్ ప్రకారం హెల్ప్ చేస్తామని హామీ ఇచ్చాడు. తమ గ్రామానికి వెళ్లే 11 కిలోమీటర్ల రోడ్డును పక్కా రోడ్డుగా మార్చాలని, ఇంటికి కనెక్టివిటీ ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గ్రామ యువతకు ఇన్సిపిరేషన్.. రూట్స్ మరవని రిషభ్ పంత్పంత్ గ్రామానికి వస్తే లోకల్ యూత్‌కి బిగ్ ఇన్స్పిరేషన్ అవుతుందని విలేజ్ హెడ్ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డాడు. పూర్వీకుల ఇంటిని మళ్లీ నిర్మించడం పంత్‌కు తన సొంత గడ్డపై ఉన్న ప్రేమను తెలియజేస్తోందని మరో బాబాయ్ లలిత్ పంత్ వెల్లడించాడు. రిషభ్ రాక కోసం గ్రామం మొత్తం వెయిట్ చేస్తోంది.