పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది ఇంట్లో విషాదం చోటుచేసుకున్న‌ది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఫ్రిది సోదరి మంగళవారం తుదిశ్వాస విడిచారు. త‌న సోద‌రి మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు. చెల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు గత రాత్రి ట్వీట్ చేశాడు. కానీ కొద్దీ గంటలతరువాత ఆమె మరణించినట్టుగా సమాచారం అందుకున్నట్టు తెలిపారు.   ఆమె అంత్య‌క్రియ‌లు ఇవాళ జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పాడు. షాహిద్ అఫ్రిది కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు. ఆరుగురు సోద‌రులు, అయిదుగురు అక్కాచెల్లెళ్లు. షాహిద్ సోద‌రులు తారిక్ అఫ్రిది, అష్ఫ‌క్ అఫ్రిది కూడా క్రికెట‌ర్లే. ప్ర‌స్తుత ఫాస్ట్ బౌల‌ర్ షహీన్ షా అఫ్రిది.. షాహిద్ అఫ్రిదికి అల్లుడే.


పాకిస్తాన్ మాజీ క్రికెటర్  అఫ్రిదీని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకరు. సుమారు  రెండు దశాబ్దాలకు పైగా బ్యాట్‌తో భీబత్సం సృష్టించాడు.  అలాగే బౌలింగ్ ఇంకా ఫీల్డింగ్ లో మెరుపులు సృష్టించాడు.  1998లో అఫ్రిది తన టెస్టు లలో అరంగేట్రం చేశాడు, ఆస్ట్రేలియాతో కరాచీలో జరిగిన తన మొదటి మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.  వన్డే క్రికెట్‌లో తన తొలి ఇన్నింగ్స్‌లోనే, అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే  వేగవంతమైన వన్డే సెంచరీని సాధించి సనత్ జయసూర్య రికార్డును బద్దలు కొట్టాడు. 17 సంవత్సరాలకు పైగా, జనవరి 2014లో కోరీ అండర్సన్ దానిని బద్దలు కొట్టడానికి ముందు ODI ఫార్మాట్‌లో ఇది వేగవంతమైన సెంచరీగా మిగిలిపోయింది.


ఆ తరువాత అఫ్రిది తన అజేయమైన ఆటతో అంతర్జాతీయంగా ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా మారాడు. క్రికెటర్‌లో అతను అత్త్యుత్తమముగా కొనసాగినప్పటికీ  వివాదాలు అతనిని చుట్టుముట్టాయి. 2005లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పిచ్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసినందుకు అఫ్రిది ఒక టెస్ట్ మ్యాచ్,  రెండు వన్డేలలో నిషేధానికి గురయ్యాడు. మళ్లీ 2007లో, అతను గొడవ తర్వాత తన బ్యాట్‌ని అభిమాని పైకి విసిరినట్టుగా చేసిన కారణంతో రెండు మ్యాచ్‌లకు నిషేధించబడ్డాడు. అలాగే  2010లో, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో బాల్‌ను కొరికి ట్యాంపరింగ్‌కు పాల్పడిన కారణంగా . రెండు టీ20లపై నిషేధం విధించారు. ఇక తాజాగా గత భారత బౌలింగ్‌ బలం గురించి కూడా  షాహిద్ అఫ్రిది  వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. కొన్నేళ్లుగా టీమిండియా క్రికెట్‌లో నాణ్యత పెరిగిందని, . ఇది చాలా అద్భుతంగా సాగుతోందన్నారు. గతంలో తాము  భారత్‌ నుంచి మంచి బ్యాట్స్‌మెన్‌లు పాకిస్థాన్‌ నుంచి మంచి బౌలర్లు వస్తారని భావించే వాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్‌ జట్టులో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఇద్దరూ బాగానే ఉన్నారు. మాంసాహారం తినడం ప్రారంభించినప్పటి నుంచి భారత బౌలర్ల మరింత మెరుగ్గా రాణిస్తున్నారన్నాడు అఫ్రిది.   ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.