ODI World Cup 2027 Venues Announced: క్రికెట్ లవర్స్ మోస్ట్ వెయిటెడ్ మెగా ఈవెంట్ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలోని టోటల్ 12 మైదానాలను ఐసీసీ గురువారం అనౌన్స్ చేసింది. అందులో సౌత్ ఆఫ్రికాలోనే 8 స్టేడియంలు మ్యాచ్ లకు హోస్టింగ్ ఇవ్వనున్నాయి. దాదాపు 24 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మార్కీ 50 ఓవర్ల టోర్నమెంట్ ఆఫ్రికా గడ్డపైకి వస్తోంది. లాస్ట్ టైమ్ 2003 లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా కలసి క్రికెట్ వరల్డ్ కప్ ను సక్సెస్ ఫుల్ గా కండక్ట్ చేశాయి. జోహన్నెస్‌బర్గ్ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో డిఫరెంట్ వేదికలను అనౌన్స్ చేయగా గ్రేమ్ స్మిత్, మఖాయా ఎంటిని, హషీమ్ ఆమ్లా, తెంబ బావుమా, కాగిసో రబాడా లాంటి క్రికెట్ స్టార్స్ హాజరయ్యారు.
సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని 12 వేదికల కంప్లీట్ లిస్ట్సౌత్ ఆఫ్రికాలోని వాండరర్స్ స్టేడియం (జోహన్నెస్‌బర్గ్), సెంచూరియన్ (త్వానే), న్యూలాండ్స్ (కేప్‌టౌన్), కింగ్స్‌మీడ్ (డర్బన్), సెయింట్ జార్జెస్ పార్క్ (గెబెహా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్‌ఫోంటెన్), బోలాండ్ పార్క్ (పార్క్), బఫెలో పార్క్ (ఈస్ట్ లండన్) లలో మ్యాచ్ లు జరగనున్నాయి. జింబాబ్వేలో హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), కొత్తగా నిర్మించిన ఫాలే మోసి-ఓవా-తున్యా ఇంటర్నేషనల్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్) లలో మ్యాచులు ఉంటాయి. నమీబియాలోని విండ్‌హోక్ లో మ్యాచ్ లు జరుగుతాయి. 24 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ ఆఫ్రికాకి రావడం క్రికెట్ హిస్టరీలో ఒక బిగ్ మైలురాయి అని ఐసీసీ ఛైర్మన్ జే షా ప్రెస్ నోట్ లో వెల్లడించారు.
57 మ్యాచ్ లు.. కొత్తగా త్రీ-స్టేజ్ ఫార్మాట్ ఎంట్రీ2027 వన్డే వరల్డ్ కప్ లో టోటల్ గా 57 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా కొత్త త్రీ-స్టేజ్ ఫార్మాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. రేటింగ్స్ లో 12 నుంచి 14 ప్లేస్ లో ఉన్న టీమ్స్ సూపర్ సిరీస్ లో రౌండ్ రాబిన్ ఫార్మాట్ ఆడి విన్నర్ నెక్స్ట్ స్టేజ్ కి క్వాలిఫై అవుతుంది. ఆ తర్వాత 12 టీమ్స్ ను టూ గ్రూప్స్ గా డివైడ్ చేసి 30 రౌండ్ రాబిన్ మ్యాచ్ లు కండక్ట్ చేస్తారు. ఇక వన్డే ప్రపంచకప్ సాధించడం కోసమే భారత వెటరన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
సూపర్ 7 ప్లస్ సెమీఫైనల్స్ రేస్ప్రతీ గ్రూప్ నుంచి టాప్ 3 టీమ్స్ తో పాటు నెక్స్ట్ బెస్ట్ పొజిషన్ లో ఉన్న టీమ్ సూపర్ 7 స్టేజ్ కి క్వాలిఫై అవుతాయి. సూపర్ 7 లో 21 రౌండ్ రాబిన్ మ్యాచులు జరిగాక టాప్ 4 పొజిషన్ లో ఉన్న టీమ్‌లు సెమీఫైనల్స్ కి చేరుకుంటాయని ఐసీసీ ప్రతినిధి తెలిపారు.
