Mohammed Shami Career In Danger:  ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ కంప్లీట్ గా తగ్గిపోయాయి. 2023 వన్డే వరల్డ్ కప్ లో కీ రోల్ ప్లే చేసిన షమీ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విక్టరీ తర్వాత సెలెక్టర్ల ఫోకస్ నుంచి దూరమయ్యాడు. ఇంజ్యూరీలతో ఫైట్ చేస్తూ డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ పర్ఫార్మన్స్ ఇస్తున్నప్పటికీ అతనికి నేషనల్ టీమ్ లో ప్లేస్ లభించడం లేదు. శ్రీలంకతో జరగబోయే రాబోయే టెస్ట్ సిరీస్ నుంచి కూడా షమీని పక్కన పెట్టడం చూస్తుంటే వెటరన్ పేసర్ ను పక్కనబెట్టి సెలెక్టర్లు ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతోంది.

Continues below advertisement

Continues below advertisement

15 మంది యంగ్ పేసర్ల షార్ట్ లిస్ట్తాజా రిపోర్ట్ ప్రకారం సెలెక్షన్ కమిటీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేస్తూ షమీ కంబ్యాక్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆల్ ఫార్మాట్స్ కోసం బిసిసిఐ సెలెక్టర్లు 15 మంది యంగ్ ఫాస్ట్ బౌలర్లను షార్ట్ లిస్ట్ చేశారు. రాబోయే ఇయర్స్ లో ఈ యంగ్ బౌలింగ్ పూల్ టీమ్ ఇండియా పేస్ అటాక్ కి మెయిన్ పిల్లర్ గా మారనుంది. విశేషమేమిటంటే ఈ 15 మంది ప్లేయర్ల లిస్ట్ లో షమీ నేమ్ కంప్లీట్ గా మిస్ అయింది.

Read Also: Ajinkya Rahane Retirement: టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై

నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టార్గెట్.. 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్ తో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ పై సెలెక్టర్లు కంప్లీట్ గా ఫోకస్ పెట్టారు. ఎక్స్‌పీరియన్స్డ్ పేసర్లతో కంటిన్యూ అవ్వడం కంటే యంగ్ ప్లేయర్లకు ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఇచ్చి రేపటి రేస్ కి ప్రిపేర్ చేయాలని మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. టీమ్ ఇండియా ట్రాన్సిషన్ ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ కావడంతో యంగ్ పేసర్లకే ప్రయారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. 

క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి.. షమీపై సంచలన కామెంట్స్ఇండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ షమీని పక్కన పెట్టడంపై తాజాగా రియాక్ట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్ లు మంచి బౌలర్లు అని, వరల్డ్ కప్ కి 15 మంత్స్ టైమ్ ఉంది కాబట్టి వీళ్లను తక్కువ అంచనా వేయలేమని అన్నాడు. అయితే షమీ అవుట్‌స్టాండింగ్ బౌలర్ అని, అలాంటి ప్లేయర్ ను మేనేజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టేయడం షాకింగ్ గా ఉందని మాజీ కెప్టెన్ శ్రీకాంత్ స్పష్టం చేశాడు.