Aakash Chopra Lends Guard To Sachin Tendulkar in 241 runs Innings:  ఇండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్ ను బయటపెట్టాడు. 2004 ఆస్ట్రేలియా టూర్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ అబ్డామినల్ గార్డ్ విరిగిపోవడంతో, తాను తన కిట్ లోని గార్డ్ ను సచిన్ కి ఇచ్చానని వెల్లడించాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై మైండ్ బ్లాకింగ్ పేషెన్స్ తో చారిత్రాత్మక 241 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాడు. "మేమిద్దరం డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నప్పుడు అతని గార్డ్ బ్రేక్ అయింది. జనరల్ గా ఎవరూ రెండు గార్డులు క్యారీ చేయరు, కానీ నా దగ్గర ఉండటంతో నేను ఇచ్చా" అని ఆకాష్ చోప్రా తాజాగా ఒక టాక్ షో లో గుర్తుచేసుకున్నాడు.

Continues below advertisement

Continues below advertisement

సింగిల్ డ్రైవ్ కూడా ఆడకుండా 241 రన్స్ నాటౌట్.. చోప్రాకు సచిన్ షాక్ఆస్ట్రేలియా సిరీస్ లో కవర్ డ్రైవ్ ఆడుతూ వరుసగా అవుట్ అవుతుండటంతో సిడ్నీ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక్క డ్రైవ్ షాట్ కూడా ఆడకూడదని సచిన్ ఫిక్స్ అయ్యాడు. 33 ఫోర్ల సాయంతో 241 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచిన ఆ ఇన్నింగ్స్ లో ఒక్క డ్రైవ్ కూడా లేదు. ఇన్నింగ్స్ ముగిశాక సచిన్ తన దగ్గరకు వచ్చి "ఆకాష్ ఏదైనా నోటీస్ చేశావా? నేను ఈ రోజు ఒక్క డ్రైవ్ కూడా ఆడలేదు" అని చెప్పాడని చోప్రా వెల్లడించాడు. స్టార్టింగ్ లో జోక్ అనుకున్నా, తర్వాత నిజమని తెలిసి షాక్ అయ్యానని చోప్రా స్పష్టం చేశాడు.

16 ఏళ్ల వయసులో డెబ్యూ.. 100 సెంచరీల వరల్డ్ రికార్డు1989 నవంబర్ 15న 16 ఏళ్ల ఏజ్ లో టెస్ట్ డెబ్యూ చేసిన సచిన్, అదే ఇయర్ డిసెంబర్ 18న ఫస్ట్ వన్డే ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 664 మ్యాచుల్లో 48.52 యావరేజ్ తో 34,357 రన్స్ చేసి ఆల్ టైమ్ టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ సచిన్ మాత్రమే.

వన్డేల్లో డబుల్ సెంచరీ.. 2011 వరల్డ్ కప్ విక్టరీవన్డేల్లో 18,426 రన్స్ (49 సెంచరీలు), టెస్టుల్లో 15,921 రన్స్ (51 సెంచరీలు) సాధించిన సచిన్ టెండూల్కర్ వన్డేల్లో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా, 200 టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 2011 ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీమ్ లో మెంబర్ గా ఉన్న సచిన్, 2013 లో ముంబై ఇండియన్స్ టీమ్ తో ఐపీఎల్ టైటిల్ కూడా గెలుచుకున్నాడని ఆకాష్ చోప్రా  వెల్లడించాడు.