IND Vs PAK Live: 19 ఓవర్లు మిగిలి ఉండగానే పాక్‌పై భారత్ విక్టరీ - పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కి!

ODI World Cup 2023, IND Vs PAK: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 14 Oct 2023 08:09 PM

Background

IND Vs PAK Live Score: ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. 2023 ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రణ క్షేత్రం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదికపై చిరకాల ప్రత్యర్థులు పోటీ...More

బౌండరీతో మ్యాచ్ ముగించిన శ్రేయస్ అయ్యర్ - 19 ఓవర్లు మిగిలి ఉండగానే!

పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లతో భారీ విజయం సాధించింది. 31వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్: 62 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) బౌండరీతో మ్యాచ్ గెలిపించాడు. ప్రపంచ కప్ చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఇది ఎనిమిదో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.