Novak Djokovic: టెన్నిస్ సూపర్ స్టార్, సెర్బియా ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా తనను దేశం నుంచి బయటకు పంపించడానికి విష పూరిత ఆహారం పెట్టి నీచంగా ప్రవర్తించారని ఆరోపించాడు. తనకు పంపించిన భోజనలో విషపూరితమైన భార లోహాలైన లెడ్, మెర్క్యూరీలను పెద్దమొత్తంలో కలిపారని, దాంతో తను తీవ్రంగా ఇబ్బందులు పడ్డానని పేర్కొన్నాడు. చావు అంచుల నుంచి బయటపడ్డానని పేర్కొన్నాడు. నిజానికి కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆస్ట్రేలియన్ అధికారులు జోకోవిచ్‌తో కొంచెం అమానవీయంగానే ప్రవర్తించారు. కోవిడ్ వాక్సిన్ వేసుకునేందుకు జోకోవిచ్ ససేమిరా అనడంతో అతడిని దేశం నుంచి డిపోర్ట్ చేశారు. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చినప్పుడు జోకోవిచ్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు తను పెద్ద పోరాటమే చేసినా ఫలితం దక్కలేదు. 


న్యాయ పోరాటం చేసినా..
ఇక 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనాలని ఎన్నో ఆశలతో మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టిన జోకోవిచ్‌కు స్థానిక అధికారుల నుంచి చుక్కెదురైంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్న వాళ్లనే దేశంలోకి అనుమతిస్తుండటంతో ఆ వ్యాక్సిన్ వేసుకుని జోకోవిచ్ చిక్కుల్లో పడ్డాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నించిన జోకోవిచ్‌ను ఆఖరికి ఒక హోటల్లో బంధించారు. అక్కడే అతడిని కొన్ని రోజుల పాటు ఉంచారు. ఆ సమయంలోనే తనకు అందించిన భోజనంలోనే ప్రమాదకర రసాయనాలు కలిపారని తెలిపాడు. అయితే ఆ విషయం తెలియని తాను ఆ భోజనాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నానని పేర్కొన్నాడు. తనను గ్రాండ్‌స్లామ్‌లో ఆడించాలని న్యాయపోరాటం చేసినా, చివరికి జోకోవిచ్‌కు ఓటమే ఎదురైంది. తనను బలవంతంగా డిపోర్ట్ చేసి సెర్బియాకు పంపించారు. 


ఇంటికొచ్చాక తేడా..
ఆస్ట్రేలియా నుంచి వచ్చాక తనకు శరీరంలో ఏదో తేడా జరుగుతోందని డౌట్ వచ్చి, ఆస్పత్రిలో చెక్ చేయించగా పెద్ద మొత్తంలో లెడ్, మెర్క్యూరీ అవశేషాలు బయట పడ్డాయని జోకోవిచ్ తెలిపాడు. ఆ తర్వాత చికిత్స తీసుకుని అందులో నుంచి బయటపడ్డానని పేర్కొన్నాడు. ఇక అప్పుడు తనతో అమర్యాదగా ప్రవర్తించిన వాళ్లను తిరిగి కలుసుకోలేదని, మళ్లీ తనకు ఎప్పుడైనా ఎదురైతే అన్ని మరిచిపోయి షేక్ హ్యాండ్ ఇస్తానని చెప్పాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా తను టూర్ చేసినప్పుడు, ఆస్ట్రేలియన్లు తన దగ్గరికి వచ్చి, తమ దేశంలో జరిగినదానికి సారీ చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం కారణంగా తనకు ఇబ్బంది కలిగిందని, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు సజావుగా ఉన్నాయని తెలిపాడు. మరోవైపు 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొన్న జోకోవిచ్.. విజేతగా నిలిచాడు. ఇక 2025లోనూ మెల్ బోర్న్ కి వచ్చిన జోకోవిచ్.. తన ఖాతాలో మరో గ్రాండ్ స్లామ్ వేసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటివరకు 24 గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన జోకోవిచ్, ముచ్చటగా 25వ టైటిల్ ను సాధించాలని తన సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ ఆదివారం నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మరోవైపు జోకోవిచ్ ఆరోపణలపై అక్కడి ప్రభుత్వం, ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు స్పందించడానికి నిరాకరించారు. 


Also Read: Viral Video: జన సంద్రమైన ఏయిర్పోర్టు.. గజమాల వేసి, పూలు చల్లుతూ నితీశ్ కు గ్రాండ్ వెల్కమ్.. విశాఖలో పండుగ చేసిన ఇండియన్ ఫ్యాన్స్