Kane Williamson Steps Down from Test Captainship:టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న కేన్ విలియమ్సన్. సంచలన ప్రకటన చేశాడు. కేన్ స్థానంలో బౌలర్ టిమ్ సౌథీ న్యూజిలాండ్ టెస్టు జట్టుకు బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే కేన్ వన్డే, టీ20 ఫార్మాట్లలో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.


టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం అని కేన్ విలియమ్సన్ అన్నాడు. టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉండటం నాకు దక్కిన గౌరవం. నా కెప్టెన్సీలో టెస్ట్ క్రికెట్ పట్టికలో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో ఉంది. కెప్టెన్ గా నేను సవాళ్లు ఆస్వాదించాను. కెప్టెన్‌గా పని, పనిభారం ఎక్కువగా ఉంటాయి. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందని భావించాను' అని అన్నాడు.


కేన్ కెప్టెన్సీలో కివీస్ జట్టు భారత్‌ను ఓడించి తొలి టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్‌ గెలుచుకుంది. అతని కెప్టెన్సీలో మిగతా రికార్డును పరిశీలిస్తే కేన్ న్యూజిలాండ్ తరఫున 38 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో 22 సార్లు టీంను గెలిపించాడు. 8 మ్యాచ్ లు డ్రాగా ముగించాడు. 


కేన్ విలియమ్సన్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పాకిస్తాన్ పర్యటనలో అతను టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. టామ్ లాథమ్ జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్ జట్టుకు 31వ టెస్టు కెప్టెన్‌గా టిమ్ సౌథీ నిలిచాడు. ఇంతకు ముందు సౌథీ టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు.


• ఆడిన టెస్టు మ్యాచ్‌లు- 40
• గెలిచినవి- 22
• ఓడనవి - 10
• డ్రాగా ముగిసినవి - 8
• గెలుపు శాతం - 55%
• చేసిన పరుగులు- 3331
• సగటు - 57.43
• 100s/50s - 11/14
• ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్ ట్రోఫీ కైవసం


ఫ్యాబ్‌4 నిష్క్రమణ


ఈ ఏడాదిలో టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న క్రికెటర్లు వీళ్లే. విరాట్‌ కోహ్లీ జనవరిలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఏప్రిల్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు జోరూట్‌ టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు విలియమ్సన్‌ టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.