ఈ ప్రపంచకప్‌లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో నెదర్సాండ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బరిలోకి దిగింది. ఈమ్యాచ్‌లో టాస్‌గెలిచిన నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగి ఆచితూచీ ఆడుతోంది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్... సెమీస్‌లో అడుగు పెట్టాలని పట్టుదలతో ఉన్న శ్రీలంకకు చాలా కీలకమైంది. నెదర్లాండ్స్ గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చి ఆత్మివిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో లంకకు షాక్ ఇవ్వాలని డచ్ జట్టు భావిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ శ్రీలంక ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే లంక సెమీస్ ఆశలు దాదాపుగా మూసుకునిపోయినట్లే. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో లంక ఉంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన నెదర్లాండ్స్ ఒక మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లతో పాయింట్ల ఎనిమిదో స్థానంలో ఉండగా...శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్లు లేకుండా పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయిస్టేడియం బౌలర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ స్టేడియంలో గత 10 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 262 పరుగులు. నెదర్లాండ్స్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఈ మెగా టోర్నీలో 3 మ్యాచ్‌లలో 54 సగటుతో మరియు 110.2 స్ట్రైక్ రేట్‌తో 108 పరుగులు చేశాడు. ఎడ్వర్డ్స్ అత్యధిక స్కోరు 78 నాటౌట్. ఈ మ్యాచ్‌లోనూ ఎడ్వర్డ్స్‌పై నెదర్లాండ్స్ ఆశలు పెట్టుకుంది. డచ్ బౌలర్ బాస్ డి లీడేపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డి లీడే 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌లో డీ లీడే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/62.
శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 3 మ్యాచ్‌ల్లో 207 పరుగులు చేశాడు. ఈ ప్రపంచ కప్‌లో శ్రీలంక తరపున టాప్ స్కోరర్‌గా కుశాల్ మెండిస్ ఉన్నాడు. కుశాల్ ఈ మ్యాచ్‌లో శతకం నమోదు చేయాలని లంక కోరుకుంటోంది. కుశాల్ ఈ మెగాటోర్నీలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌పై మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాలని కుశాల్ మెండీస్ భావిస్తున్నాడు. దిల్షాన్ మధుశంక కూడా రాణించాలని లంక కోరుకుంటోంది. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 26.28 సగటుతో మధుశంక 7 వికెట్లు తీశాడు. 3/38 మధుశంక అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. ఇప్పటివరకూ వన్డేల్లో నెదర్లాండ్స్-శ్రీలంక అయిదుసార్లు తలపడగా అయిదుసార్లు శ్రీలంకే విజయం సాధించింది. ఈ అయిదు మ్యాచుల్లో లంక అత్యధిక స్కోరు 443. నెదర్లాండ్స్‌ను ఓ మ్యాచ్‌లో లంక 86 పరుగులకే కుప్పకూల్చింది.
నెదర్లాండ్స్ ఫైనల్ 11:
విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ'డౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడ్, తేజా నిడమనూరు,
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్త్, పాల్ వాన్ మీకెరెన్,
శ్రీలంక ఫైనల్ 11:
పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుశాంత్ , లహిరు కుమార