భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పసికూనల సంచలనాలు ప్రకంపనలు సృష్టిస్తుండగా... వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచకప్‌లోనూ ఇవి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలే టీ 20 క్రికెట్ అంటేనే సంచలనాలకు మారుపేరుగా ఉంటుంది. అలాంటిది మెగా టోర్నమెంట్‌లో ప్రకంపనలు ఇంకా ఎక్కువగానే ఆశించొచ్చు. ఎందుకంటే నెదర్లాండ్స్, అఫ్ఘానిస్తాన్ ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌లో సంచలనాలు సృష్టిస్తుండగా... ఇప్పుడు టీ 20 ప్రపంచకప్‌నకు పసికూన నేపాల్ అర్హత సాధించింది. ఆసియా దేశాలకు సంబంధించి ఐసీసీ నిర్వహించిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో నేపాల్ మెరుపులు మెరిపించింది. సెమీ ఫైనల్స్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను మట్టికరిపించి అమెరికా, వెస్టిండీస్‌లల్లో జరిగే టీ20 వరల్డ్ కప్‌నకు అర్హత సాధించింది.
ఖాట్మాండూలోని ముల్పానీ స్టేడియం జరిగిన టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అరవింద్ 64 పరుగులతో రాణించాడు. ఒక దశలో భారీ స్కోర్ చేస్తుందనిపించిన యూఏఈని నేపాల్ బౌలర్లు కట్టడి చేశారు. నేపాల్ బౌలర్లల్లో కుశాల్ మల్లా మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ బ్యాటర్లు 17.1 ఓవర్లల్లోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్ ఆసిఫ్ షేక్ 64, కేప్టెన్ రోహిత్ పౌఢెల్ 34 పరుగులతో అజేయంగా నిలిచి నేపాల్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఈ విజయంతో నేపాల్ టీ 20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌ను చూడ్డానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సమీపంలో ఉన్న మిద్దెలు, మేడలు ఎక్కి మరీ మ్యాచ్‌ను వీక్షించారు. గ్రౌండ్ నిండటంతో.. మైదానాన్ని ఆనుకుని ఉన్న భవనాలపై కూర్చుని, నిల్చుని మరీ తమ దేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఇసుక వేస్తే రాలనంత జనం ఈ మ్యాచ్ ను చూడ్డానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. క్రికెట్ అంటే ఇంత పిచ్చా? అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. అభిమానానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం ఉంటుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో రికార్డులను బద్దలు కొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు మైదానంలో పరుగుల వరద పారించారు. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీల్లో భాగంగా హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ స్టేడియంలో నేపాల్ వర్సెస్ మంగోలియా జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మంగోలియా నేపాల్ జట్టుకు తొలుత బ్యాటింగ్ అవకాశం ఇచ్చింది. నేపాల్ బ్యాటర్లు మొదటి నుంచి బౌండరీల వర్షం కురిపించారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 314 పరుగులు చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. ఆసియా క్రీడల్లో జరిగే మ్యాచ్ లకు టీ20 హోదాను మంజూరు చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గతంలో ధృవీకరించింది.
నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ ఎనిమిది సిక్స్‌ల సహాయంతో తొమ్మిది బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 10 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌ఫై యువరాజ్ సింగ్ 12 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసి ప్రపంచంలోనే వేగంగా ఆఫ్ సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డుల్లో నిలిచాడు. దిపేంద్ర సింగ్ తన సుడిగాలి బ్యాటింగ్‌తో యువరాజ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌ను చూడ్డానికి జనం తండోపతండాలుగా తరలిరావడం.. క్రికెట్‌పై వారికి ఉన్నఆసక్తిని చాటింది. గ్రౌండ్‌కు అభిమానులు పోటెత్తారు. సమీపంలో ఉన్న మిద్దెలు, మేడలు ఎక్కి మరీ మ్యాచ్‌ను వీక్షించారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వారు లెక్కచేయలేదు. జట్టు విజయాన్ని ఆస్వాదించారు.
టీ20 ప్రపంచ కప్ 2024లో పెను సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ వంటి జట్లు పెద్ద టీమ్‌లకు చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి జెయింట్ కిల్లర్స్‌గా గుర్తింపు పొందింది ఆఫ్ఘనిస్తాన్.
అటు నెదర్లాండ్స్ కూడా తీసిపారేయని విధంగా ఆడుతోంది ఈ టోర్నమెంట్‌లో. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. దక్షిణాఫ్రికన్లను మట్టికరిపించిన ఘనత ఉందా డచ్ టీమ్‌కు. టీ20 ప్రపంచ కప్‌లోనూ ఇలాంటి కనీవినీ ఎరుగని విజయాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు.