Najmul Hossain Shanto: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో గాలెలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా అద్భుతంగా ఆడి సరికొత్త నెలకొల్పాడు. జూన్ 17న మొదలైన టెస్ట ఇవాళ ఐదోరోజు సాగుతోంది. రెండు జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది. బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 495 రన్‌లు చేసింది, ఇందులో షాంటో 148 పరుగులు చేశాడు. శ్రీలంక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 485 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 285/6తో డిక్లేర్ చేసింది. ఇందులో షాంటో మరో శతకం (104 పరుగులు) చేశాడు. ఈ రెండు శతకాలు ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిగా చెప్పవచ్చు.
షాంటో రికార్డు ఏంటి?ఈ రెండు సెంచరీలతో నజ్ముల్ హుస్సేన్ షాంటో బంగ్లాదేశ్ కెప్టెన్‌లలో ఒక టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో శతకాలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డును ఎవరూ సాధించలేదు. షాంటో మొదటి ఇన్నింగ్స్‌లో 148 రన్‌లు రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేసి ప్రత్యర్థులకు బిగ్ టార్గెట్ డిసైడ్ చేశాడు. ఈ రికార్డు ఆయన బ్యాటింగ్ నైపుణ్యాన్ని, ఒత్తిడి సమయంలో ఆట తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
షాంటో ఆట ఎలా ఉంది?షాంటో ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకర్షించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆయన 279 బంతులు ఆడి 148 రన్‌లు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్‌లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగుల చేశాడు. దీని కోసం 141 బంతులు ఎదుర్కొన్నాడు. శ్రీలంక బౌలర్లు బంతులతో ఎదురు దాడి చేసినా షాంటో ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. జట్టును గెలిపించే దిశగా కీలకమైన కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఎక్కువ పరుగులు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్‌లు
ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు, 2013లో అదే వేదికపై ముష్ఫికర్ రహీమ్ చేసిన 200 పరుగుల రికార్డును నజ్ముల్ హుస్సేన్ షాంటో అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 273 పరుగులతో శాంటో ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నాడు.
273 - నజ్ముల్ హుస్సేన్ షాంటో* (శ్రీలంకపై), 2025లో గాలెలో
200 - ముష్ఫికర్ రహీమ్ (శ్రీలంకపై), 2013లో గాలే
187 - షకీబ్ అల్ హసన్ (న్యూజిలాండ్‌పై), 2010లో హామిల్టన్
172 - ముష్ఫికర్ రహీమ్ (న్యూజిలాండ్‌పై), 2017లో వెల్లింగ్టన్
168 - మహ్మదుల్లా (న్యూజిలాండ్), 2019లో హామిల్టన్
కనీసం పోటీ ఇవ్వలేకపోయిన శ్రీలంక
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను 285/6తో డిక్లేర్ చేయడంతో శ్రీలంక విజయం కోసం 296 పరుగులు చేయాలి. ప్రస్తుతానికి నాలుగు గంటల వరకు 36 పరుగులు చేసి2 వికెట్లు కోల్పోయింది. ఆటకు ఇంకో సెషన్ మాత్రమే ఉంది. అంటే దాదాపు పాతిక ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా 260 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లుఉన్నాయి. మాథ్యాస్ తన చివరి టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అతనికి గ్రాండ్ పేర్‌వెల్ ఇవ్వాలన్న కసితో శ్రీలంక ఆడుతుందని అనుకున్నారు కానీ మొదటి నుంచి కూడా ప్రభావం చూపలేకపోయింది. బౌలంగ్, బ్యాటింగ్ రెండింటిలో కూడా ఆకట్టుకోలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్‌ను 285 పరుగులకే ముగించేసింది. తర్వాత బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయలేక చేతులు ఎత్తేసింది. వాళ్లు డిక్లేర్ చేసే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు టార్గెట్‌ను ఛేదించడానికి కూడా ఎదురీదుతోంది. ప్రస్తుతం క్రీజ్‌లో ఆంగ్లో మ్యాథ్యూస్, దినేష్ చండిమల్ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులతో అదరగొట్టిన నిస్సంక ఈసారి 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు.