Chahal - Dhanashree Verma Divorce: చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
Chahal Divorce | టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నాడు. చాహల్, ధనశ్రీ వర్మ పరస్పర అంగీకారంతో కోర్టు విడాకులు మంజూరు చేయాలని నిర్ణయించింది.

Chahal - Dhanashree Verma Seperation: ముంబై టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోవడం కన్మామ్ అయింది. గత కొన్ని నెలలుగా వీరి విడాకులపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారని తేలిపోయింది. ముంబై ఫ్యామిలీ కోర్టును వీరి విడాకుల అంశంపై తేల్చాలని బాంబే హైకోర్టు సూచించింది.
క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ రెండున్నరేళ్ల్ నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B కింద పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేయాలని వీరు ముంబై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 5, 2025న చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తమకు ఆరు నెలల గడువు వద్దని, ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫ్యామిలీ కోర్టుకు తెలిపారు.
భరణం ఎంత ఇవ్వనున్నాడు..
డిసెంబర్ 2020లో కరోనా సమయంలో చాహల్, ధనశ్రీ వర్మ వివాహం చేసుకున్నారు. భేదాభిప్రాయాలు రావడం, తమ దారులు ఒకటి కాదని భావించిన ఈ జంట దాదాపు రెండున్నరేళ్లు నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. తమ దారులు వేరని, విడాకులు కావాలని ముంబై ఫ్యామిలీ కోర్టును ఫిబ్రవరిలో ఆశ్రయించారు. విడాకుల సందర్భంగా భార్య ధనశ్రీ వర్మకు చాహల్ రూ. 4.75 కోట్లు భరణంగా ఇవ్వాలని కోర్టు నిర్ణయించగా క్రికెటర్ అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే రూ.2.37 కోట్లు చెల్లించగా.. మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. పరస్పర అంగీకారంతో విడిపోతున్నారని ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయనుంది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B కింద విడాకుల కోసం నిర్దేశించిన 6 నెలల గడువును రద్దు చేయాలని కోరుతూ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు బాంబే హైకోర్టు బుధవారం అనుమతించింది. చాహల్ ఐపీఎల్ పాల్గొంటారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రేపటిలోగా విడాకుల పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఏకసభ్య ధర్మాసనం జడ్జి జస్టిస్ మాధవ్ జాందార్ ఫ్యామిలీ కోర్టుకు సూచించారు.
ఒకరినొకరు అన్ ఫాలో
ఇక సోషల్ మీడియాలో భార్యాభర్తలిద్దరూ చాహల్, ధనశ్రీ వర్మ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ధనశ్రీతో దిగిన ఫోటోలను చాహల్ ఇటీవల డిలీట్ చేయగా, ధనశ్రీ వర్మ మాత్రం కొన్ని ఫొటోలను తన సోషల్ ఖాతాల్లో ఉంచింది. వీరు విడాకుల కోసం అప్లై చేసుకున్నారని, త్వరలోనే ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో వీరు విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించడంతో విషయం కన్ఫామ్ అయింది.
ఇక ఐపీఎల్‌లో చాహల్ పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. రూ.18 కోట్లతో పంజాబ్ మేనేజ మెంట్ గత ఏడాది చివర్లో జరిగిన మేగా వేలంలో చాహల్ ను కొనుగోలు చేసింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ తాజా ఎడిషన్ ప్రారంభమవుతుంది.