IPL 2025 Chahal News : తన భార్య, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకులు తీసుకోబోతున్నాడనే ఊహగానాలు సమర్థించేలా భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ (Chahal) తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. చాలాకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటారనే పుకార్లు షికారు చేశాయి. అయితే ఇప్పటివరకు దీనిపై ఇటు చాహల్ కానీ, అటు ధనశ్రీ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వారి సన్నిహితుల ప్రకారం ప్రకారం త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నిందాపూర్వక పోస్టు..
తాజాగా సోషల్ మీడియాలో చాహల్ ఒక పోస్టును పంచుకున్నాడు. అందరూ విజయాన్ని మాత్రమే చూస్తుంటారని, కానీ ఆ విజయాన్ని సాధించడంతో సదరు వ్యక్తి ఎంతగా కష్టాలు పడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో గుర్తించరని వ్యాఖ్యానించాడు. అలాగే తన ఆటతో అటు తండ్రిని, తల్లిని గర్వపడేలా చేశానని, ఇది ఎల్లకాలం కొనసాగుతుందని పోస్ట్ చేశాడు. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పోస్టు చేశారో తెలియకపోయినా, నేరుగా ధనశ్రీని ఉద్దేశించే పోస్టు చేసి ఉంటారని కామెంట్లు వస్తున్నాయి. 2020 లాక్ డౌన్ సందర్భంగా ధనశ్రీతో చాహల్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో వారిద్దరూ 2020 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా గత కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు.
ఒకరినొకరు అన్ ఫాలో..
ఇక సోషల్ మీడియాలో భార్యాభర్తలిద్దరూ అన్ ఫాలో చేసుకున్నారు. తన అకౌంట్‌లో ధనశ్రీతో దిగిన ఫోటోలను చాహల్ డిలీట్ చేయగా, ధనశ్రీ మాత్రం కొన్ని ఫొటోలను ఉంచింది. అయితే వీరిద్దరు ఇలా విడిగా ఉండటానికి కారణాలు తెలియడం లేదు. విడాకుల కోసం కూడా అప్లై చేసుకున్నారని, త్వరలోనే దీనిపై సమాచారం వస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే రిలేషన్ షిప్‌లో చాహల్ అన్ హేపీగా ఉన్నాడని, అలాగే ఇలాంటి మెసేజ్ పెట్టాడని అతని అభిమానులు వాదిస్తున్నారు. ఏదేమైనా చాహల్ వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇరువురు భార్యాభార్తలు విడివిడిగా ఉంటుండంతో పాటు రూమర్లపై స్పందించకపోవడంతో ఈ విషయం ఇంకా జటిలంగా మారింది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం చాహల్ భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడటం లేదు. దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి తను జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కేవలం దేశవాళీల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక 2025 ఐపీఎల్‌లో తను పంజాబ్ కింగ్స్ తరపున చాహల్ బరిలోకి దిగనున్నాడు. రూ.18 కోట్లతో అతడిని కింగ్స్ కొనుగోలు చేసింది. వచ్చే మార్చి నుంచి ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభమవుతుంది.