Badrinath Reveals Dhoni Stance On Impact Role: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్.. మహేంద్ర సింగ్ ధోని పాత్రపై కీలక విషయాలను తెలిపాడు. ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం లేదని, పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గా 20 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు అతడు మొగ్గు చూపుతున్నాడని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే ప్లేఆఫ్స్ కు చేరుకోలేక నిష్క్రమించిన తర్వాత రాబోయే సీజన్ కోసం ధోని భవితవ్యం, ఫిట్‌నెస్ పై విస్తృతంగా చర్చ జ‌రుగుతోంది. శారీరక శ్రమను తగ్గించుకునేందుకు ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడితే జట్టుకు వ్యూహాత్మకంగా ఎంతో మేలు జరుగుతుందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు.

Continues below advertisement

Read Also: BCCI Review Meeting: బీసీసీఐ సమీక్షా సమావేశం షురూ.. గంభీర్, గిల్, శ్రేయస్ హాజరు.. ఫ‌లితాల‌పై పోస్ట్ మార్టం..

ఫుల్ టైమ్ కీప‌ర్ గానే.. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన బద్రీనాథ్, ధోని నిర్ణయాన్ని తెలిపాడు. "తాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడబోనని ధోని నాతో స్వయంగా చెప్పాడు. అతడు తనను తాను ఫుల్ టైమ్ కీపర్‌గానే చూసుకుంటున్నాడు, అంటే మొత్తం 20 ఓవర్ల పాటు మైదానంలో ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాడు. కానీ ఒకవేళ అతడు అలా ఆడితే అది సీఎస్కేకు టాక్టికల్ గా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ధోని శరీరం ఎక్కువ సేపు ఒత్తిడిని తట్టుకోలేదని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఇప్పటికే చెప్పాడు. కేవలం 16వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి, వికెట్ కీపింగ్ మాత్రమే చేసేటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండటమే సరైన విధానం" అని బద్రీనాథ్ పేర్కొన్నాడు.

Continues below advertisement

Read Also: Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు

ఆ ఆరోప‌ణ‌లు స‌రికాదు.ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల శివం దూబేకు బౌలింగ్ అవకాశాలు రాలేదన్న వాదనలను బద్రీనాథ్ కొట్టిపారేశాడు. "శివం దూబే ఇండియా తరఫున రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తూ, సీఎస్కే తరఫున బౌలింగ్ చేయకపోవడానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణం కాదు. అది పూర్తిగా చెన్నై మేనేజ్‌మెంట్ వైఫల్యం. బంతితో అతడిని ఉపయోగించుకోవడంలో వారు వెనుకబడ్డారు. దూబేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకు వాడుతున్నారు? మీ స్వంత తప్పులకు నిబంధనలను నిందించడం సరైంది కాదు" అని అతడు విమర్శించాడు.

వ్యూహాత్మ‌క లోపం..వెస్టిండీస్ స్పిన్నర్ అకిల్ హొస్సేన్‌ను జట్టు వాడుకున్న తీరుపై కూడా బద్రీనాథ్ విమ‌ర్శ‌లు చేశాడు. "అకిల్ హొస్సేన్ తుది జట్టులో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడు. కానీ సీఎస్కే అతడిని ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో రిజర్వ్‌గా ఉంచుతోంది. తీరా బ్యాటింగ్ కుప్పకూలినప్పుడు మరో ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దించుతున్నారు. దీనివల్ల హొస్సేన్ మ్యాచ్ ఆడకుండా బెంచ్‌పైనే ఉండిపోతున్నాడు. ఇది వ్యూహాత్మక లోపం తప్ప మరొకటి కాదు" అని పేర్కొన్నాడు.