ICC Hall Of Fame 2025 : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని హాల్ ఆఫ్ ఫేమ్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చేర్చింది. అంతర్జాతీయ, భారత క్రికెట్‌కు ఆయన చేసిన అసమాన కృషికి గాను ఆయనకు ఈ గౌరవం లభించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC ఫైనల్ 2025) కు కేవలం 2 రోజుల ముందు, లండన్‌లో ఒక వేడుక జరిగింది, దీనిలో ఎంఎస్ ధోనితో సహా 7 మంది దిగ్గజ క్రికెటర్లకు హాల్ ఆఫ్ ఫేమ్‌తో సత్కరించారు.

ఎంఎస్ ధోనితోపాటు, మాథ్యూ హెడెన్, గ్రేమ్ స్మిత్, డేనియల్ వెట్టోరి, హషీమ్ ఆమ్లాను హాల్ ఆఫ్ ఫేమ్‌తో గుర్తించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్ ధోని. అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత దాదాపు 5 సంవత్సరాల తర్వాత ధోనికి ఈ గౌరవం లభించింది. ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఎంఎస్ ధోని చివరి మ్యాచ్ 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్ ఆడాడు.  

'కెప్టెన్ కూల్' అని పిలుచుకునే ఎంఎస్ ధోని కూడా అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్లలో ఒకరు. అతని కెప్టెన్సీలో భారతదేశం 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. ధోని నాయకత్వంలో, టీం ఇండియా 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

MS ధోని 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తరువాత 2007లో అతను టీం ఇండియా కెప్టెన్ అయ్యాడు. 2007 T20 ప్రపంచ కప్‌లో భారత జట్టు యువ ఆటగాడి కెప్టెన్సీలో ఆడింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించినప్పుడు భారతదేశం మొత్తం ఆనందతాండవం చేసింది. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో భారతదేశం 2010, 2016లో ఆసియా కప్ టైటిళ్లు గెలుచుకుంది. 2008, 2009లో అతనికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.

"ఒత్తిడిలో అతని ప్రశాంతత, సాటిలేని వ్యూహాత్మక నైపుణ్యానికి లభించిన గౌరవం. కానీ చిన్న ఫార్మాట్లలో ఒక మార్గదర్శకుడిగా, ఆటలో గొప్ప ఫినిషర్లు, నాయకులు,  వికెట్ కీపర్లలో ఒకరిగా MS ధోని లెగసీని ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చి గౌరవించారు" అని ICC ఒక ప్రకటనలో తెలిపింది.

'ఎ డే విత్ ది లెజెండ్స్'అనే ప్రత్యేక కార్యక్మం ద్వారా ఈ ఇండికేషన్ వేడుక జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ వేడుకను చూసేందుకు వీలుగా ICC అధికారిక మీడియాల్లో లైవ్ ఇచ్చారు.  

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన భారత క్రికెటర్లుఇప్పటివరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరకిన భారతీయ క్రికెటర్లు వీళ్లే: ఎంఎస్ ధోని, నీతు డేవిడ్, డయానా ఎడుల్జీ, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడి, సునీల్ గవాస్కర్.

ICC హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏమిటి?క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లను గుర్తించడానికి సృష్టించిందే ICC హాల్ ఆఫ్ ఫేమ్. అంతర్జాతీయ క్రికెటర్ల సంఘాల సమాఖ్య (FICA) సహకారంతో జనవరి 2, 2009న ప్రారంభించారు.  

అర్హత ప్రమాణాలు

హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించాలంటే బ్యాటర్లు సాధారణంగా కనీసం 8,000 అంతర్జాతీయ పరుగులు, 20 సెంచరీలు సాధించి ఉండాలి లేదా కెరీర్ సగటును 50 కంటే ఎక్కువ ఉండాలి.

టెస్ట్ లేదా వన్డే ఫార్మాట్లలో బౌలర్లు కనీసం 200 వికెట్లు తీసి ఉండాలి.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే ఆటగాళ్లు అర్హులు.