IND Spin Attack Strategy VS SL Revealed:  శ్రీలంకతో గాలే వేదికగా జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తెలిపాడు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజా ముగ్గురూ విభిన్నమైన శైలితో వికెట్లు తీయగల సమర్థులని పేర్కొన్నాడు. కుల్దీప్ తన మిస్టరీ చైనామన్ బౌలింగ్ తో, జడేజా పక్కా లైన్ అండ్ లెంగ్త్ అక్యూరసీతో, మానవ్ సుతార్ క్లాసికల్ లూపీ స్పిన్ తో ప్రత్యర్థిని కంగారు పెట్టగలరని గురువారం ప్రెస్ మీట్ లో వివరించాడు.

Continues below advertisement

Continues below advertisement

ముగ్గురిదీ డిఫరెంట్ స్టైల్.. గిల్ యూసేజ్ పైనే డిపెండ్"కుల్దీప్ మన అటాకింగ్ బౌలర్. అతడి క్లాస్, ఎక్స్‌పీరియన్స్ చాలా ముఖ్యం. మానవ్ సుతార్ బాల్ ని ఎక్కువగా టర్న్ చేయగలడు, జడేజా మోస్ట్ అక్యురేట్ బౌలర్. ముగ్గురిదీ వేర్వేరు శైలి కావడం వల్ల ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఆడటం మాకు పెద్ద సమస్య కాదు. సమయానుకూలంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరిని ఎలా యూజ్ చేసుకుంటాడనే దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థి 20 వికెట్లు తీయగల కెపాసిటీ వీళ్లకు ఉంది" అని మోర్కెల్ తెలిపాడు.

గాలే పిచ్ పై స్పెషల్ ఫోకస్.. మైండ్ సెట్ చాలా ముఖ్యంగాలే స్టేడియం హిస్టరీ, పిచ్ కండిషన్స్ చూస్తే ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లడమే బెస్ట్ ఆప్షన్ అని మోర్కెల్ చెప్పాడు. "పిచ్ చూడటానికి బాగుంది. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్ కి అనుకూలిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఫిజికల్ కండిషన్స్ కంటే మైండ్ సెట్, ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం, సరైన ఏరియాల్లో బౌలింగ్ చేయడం చాలా క్రూషియల్" అని వ్యాఖ్యానించాడు.

సీనియర్ సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ లేదా గుర్నూర్ బ్రార్సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్‌లలో ఒకరికి సపోర్ట్ పేసర్‌గా ఛాన్స్ దక్కనుంది. ఇద్దరికీ టెస్ట్ ఎక్స్‌పీరియన్స్ తక్కువే ఉన్నప్పటికీ లోకల్ క్రికెట్ బాగా ఆడారని మోర్కెల్ తెలిపాడు. శ్రీలంకలో ఉండే వేడి, తేమను తట్టుకుని కూకబుర్రా బాల్ మెత్తబడ్డాక ప్రెజర్ మైంటైన్ చేయడం బిగ్ ఛాలెంజ్. వీధి తెలివితేటలు ప్రదర్శిస్తూ వికెట్ మీద నుంచి బౌలింగ్ వేయడం, షార్ట్ బాల్స్ యూజ్ చేయడంలో బౌలర్లు కంటిన్యూయస్ ఇంటెన్సిటీ చూపించాలని మోర్కేల్ వివరించాడు.