Sreesanth Challenges Bhajji Ring: ఇండియన్ మాజీ క్రికెటర్లు ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య విబేధాలు మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఐపీఎల్ 2008 లో జరిగిన 'స్లాప్‌గేట్' ఇన్సిడెంట్ తర్వాత ఇద్దరూ చాలా ఏళ్లు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత పరిస్థితులు కొద్దిగా బాగుపడినట్లు అనిపించినా, భజ్జీ చేసిన ఒక యాడ్ పాత గాయాలను మళ్లీ రేపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ, శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా ఉండటానికి తాను ఇష్టపడతానని, ఒకే రూమ్‌లో ఉంటే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని తెలిపాడు.
ఒకే రూమ్‌లో ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.. భజ్జీ మైండ్ సెట్భజ్జీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మేమిద్దరం ఒకే రూమ్‌లో ఉంటే చాలా విషయాలు క్లియర్ అవుతాయి. నేను ఆ యాంగిల్ లోనే ఆలోచిస్తున్నాను. అతడిని నా రూమ్‌మేట్‌గా పిక్ చేసినా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు" అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు భజ్జీ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
బాక్సింగ్ రింగ్‌లోకి వస్తావా.. శ్రీశాంత్ డైరెక్ట్ ఛాలెంజ్అయితే ఒక ఇంటరాక్షన్ లో శ్రీశాంత్‌కు భజ్జీతో ఉన్న పాత బాక్సింగ్ గేర్ ఫోటో చూపించగా అతడు తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. భజ్జీకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ, "బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని నా ముందుకు వచ్చే దమ్ము ఉందా? రింగ్‌లోకి వచ్చి సంతకం చేసి ఆడగలవా? ఇది ఆక్టింగ్ కాదు, నా ఫేస్ లో నవ్వు ఉందని, జోక్ గా తీసుకోకు. నీకు ఎంత దమ్ము ఉందో చూద్దాం . ఇది నా ఓపెన్ ఛాలెంజ్" అని శ్రీశాంత్ ఘాటుగా కామెంట్ చేశాడు.
బేర్ నకిల్ ఫైట్ లీగ్ ప్రమోషన్.. భజ్జీ ఫైట్ పై శ్రీశాంత్ కామెంట్స్శ్రీశాంత్ కంటిన్యూ చేస్తూ "ప్రెజెంట్ నేను బేర్ నకిల్ ఫైట్ లీగ్ లో ఉన్నాను. కానర్ మెక్‌గ్రెగర్ వీడియో మెయిన్ స్పాన్సర్లలో ఒకరు నా మంచి ఫ్రెండ్. ఆ ప్రమోషన్ కూడా పూర్తయింది. భజ్జీ, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను" అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. భజ్జీ శాంతిమంత్రం జపిస్తుంటే శ్రీశాంత్ మాత్రం బాక్సింగ్ రింగ్ పోరుకి రెడీ అని చెప్పడం క్రికెట్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
