Hasin Jahan: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి షాక్. తన మాజీ భార్య హసీన్ జహాన్ కు షమీ నెలకు రూ. 1.30 లక్షల భరణం చెల్లించాలని కోల్ కతా కోర్టు ఆదేశించింది. అందులో రూ. 50వేలు జహాన్ ఖర్చులకు కాగా.. మరో 80 వేలు ఆమెతో కలిసి ఉంటున్న వారి కుమార్తె పోషణ కోసం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆదాయపు పన్ను రిటర్నుల ప్రకారం,  2020-21 ఆర్థిక సంవత్సరంలో షమీ వార్షిక ఆదాయం రూ. 7 కోట్ల కంటే ఎక్కువ ఉందని.. దాని ఆధారంగా నెలవారీ భరణాన్ని కోరినట్లు జహాన్ న్యాయవాది మృగాంక మిస్త్రీ కోర్టుకు తెలియజేశారు. 


అయితే కోర్టు తీర్పుపై షమీ మాజీ భార్య హసీన్ జహాన్ అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. ఆమె నెలకు రూ. 10 లక్షల భరణం కోరిందని తెలుస్తోంది. ఇందులో రూ. 7 లక్షలు ఆమె వ్యక్తిగత ఖర్చుల కోసం.. రూ. 3 లక్షలు కుమార్తె పోషణ కోసం అడిగన్నట్లు పేర్కొంది. ఈ తీర్పుపై జహాన్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.


2018లో షమీ తనపై గృహహింసకు పాల్పడుతున్నాడని జహాన్ హసీన్‌ కోర్టును ఆశ్రయించింది. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.