WPL 2025 Live Updates: డబ్ల్యూపీఎల్ లో మాజీ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ ముచ్చ‌టగా మూడో విజ‌యాన్ని అందుకుంది. బుధ‌వారం బెంగ‌ళూరులో జ‌రిగిన మ్యాచ్ లో యూపీ వారియ‌ర్స్ పై ఎనిమిది వికెట్ల‌తో సునాయ‌స విజ‌యం సాధించింది. అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపీ వారియ‌ర్జ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల‌కు 142 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ గ్రేస్ హారిస్ (26 బంతుల్లో 45, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) వేగంగా ఆడి టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. బౌల‌ర్ల‌లో నాట్ స్కివ‌ర్ బ్రంట్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటింది. అనంత‌రం ఛేజింగ్ ను ముంబై సునాయాసంగా పూర్తి చేసింది. బ్యాటింగ్ లో నూ స‌త్తా చాటిన బ్రంట్ విధ్వంస‌క అజేయ ఫిఫ్టీ (44 బంతుల్లో 75 నాటౌట్, 13 ఫోర్లు)తో స‌త్తా చాటింది. దీంతో కేవ‌లం 17 ఓవ‌ర్ల‌లోనే రెండు వికెట్లకు 143 ప‌రుగుల చేసిన ముంబై గెలుపొందింది. ఆల్ రౌండ్ షో తో అద‌ర‌గొట్టిన బ్రంట్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది. త‌ర్వాతి మ్యాచ్ లో ఆర్సీబీతో గుజరాత్ జెయింట్స్ త‌ల‌ప‌డుతారు. 

బ్యాట‌ర్లు విఫ‌లం..ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన యూపీని బ్యాటర్ల వైఫ‌ల్యం వెంటాడింది. ఓపెన‌ర్ కిర‌ణ్ న‌వ‌గిరే (1)తో విఫ‌లం కాగా. మ‌రో ఓపెన‌ర్ హారిస్.. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ దినేశ్ వృందా (33) తో క‌లిసి కొద్ది సేపు ఓపిక‌గా ఆడింది. వీరిద్ద‌రూ స‌త్తా చాటి మెరైన స్ట్రైక్ రేట్ తోపాటు బౌండ‌రీలు సాధించ‌డంతో ఒక ద‌శ‌లో స్కోరు 81-1తో నిలిచింది. అయితే వీరిద్ద‌రూ వ‌రుస ఓవ‌ర్లలో ఔట‌వ‌డంతో యూపీ ప‌త‌నం మొద‌లైంది. వ‌చ్చిన‌వారు వ‌చ్చిన‌ట్లు వెనుదిరిగారు. మ‌ధ్య‌లో శ్వేతా షెరావ‌త్ (19), వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఉమా ఛెత్రి (13 నాటౌట్) డ‌బుల్ డిజిట్ స్కోర్ల‌తో పోరాడటంతో యూపీ కాస్త గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరును సాధించింది. బౌల‌ర్ల‌లో ష‌బ్నిం ఇస్మాయిల్, సంస్కృతి గుప్తాకు రెండు, హ‌లీ మ‌థ్యూస్, అమెలియా కెర్ కు త‌లో వికెట్ ద‌క్కింది. 

రాణించిన హీలీ, బ్రంట్..ఛేద‌న ఆరంభంలోనే ముంబైకి య‌స్తికా భాటియా డ‌కౌట్ రూపంలో చిన్న‌పాటి షాక్ త‌గిలినా, కోలుకుంది. మ‌రో ఓపెన‌ర్ హీలీ (50 బంతుల్లో 59, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడింది. బ్రంట్ తో క‌లిసి యూపీ బౌలర్ల‌ను ఈజీగా ఎదుర్కొన్న హీలీ.. స్కోరుబోర్డును ప‌రుగులు పెట్టించింది. వీరిద్ద‌రూ రెచ్చిపోవ‌డంతో రెండో వికెట్ కు ఏకంగా 133 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదైంది. దీంతో 29 బంతుల్లో బ్రంట్.. 45 బంతుల్లో హీలీ అర్థ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. విజ‌యానికి మ‌రో నాలుగు ప‌రుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో హీలి వెనుదిరిగింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (4 నాటౌట్) ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ‌రీకి పంపి, జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించింది. బౌల‌ర్ల‌లో సోఫీ ఎకిల్ స్టోన్, దీప్తి శ‌ర్మ‌కు త‌లో వికెట్ ద‌క్కింది. గ‌త మ్యాచ్ లో యూపీతో సూప‌ర్ ఓవ‌ర్లో నెగ్గి అద్భుత పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించిన యూపీ.. ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయింది. 

Read Also: AFG Vs Eng Result Update: ఆఫ్గాన్ అద్భుత విజ‌యం.. టోర్నీ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. రూట్ సెంచ‌రీ వృథా