Siraj News: 'ఆమె నాకు చెల్లెలులాంటిది' - వర్థమాన సింగర్‌తో రిలేషన్ షిప్‌పై సిరాజ్ రిప్లై
Mohammad Siraj: 2023 నుంచి వన్డేల్లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసింది సిరాజేనని అభిమానులు గుర్తు చేస్తున్నారు. అత్యధిక వికెట్లు కూడా అతనే తీశాడని అలాంటి ప్లేయర్‌ను పక్కన పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.

ICC Champions Trophy: భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తాజాగా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. వర్థమాన సింగర్, జనాయ్ భొంస్లే బర్త్ డే సందర్భంగా ఆమెతో దిగిన పిక్ ఒక్కసారి వైరల్‌గా మారింది. సిరాజ్‌కు ఆమెకు మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు చెలరేగాయి. దీంతో ఈ విషయంతో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కింది. తాజాగా జనాయ్.. దీనిపై స్పందించింది. సిరాజ్ తనకు కేవలం అన్నలాంటోడని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్స్టాగ్రామ్‌లో తెలిపింది. మేరీ ప్యారా భయ్యా అంటే నా ప్రియమైన సోదరుడా అని పోస్ట్ చేసింది. తాజాగా ఈ పోస్టుపై అభిమానలు స్పందింస్తున్నారు. సిరాజ్ ప్రేమలో ఉన్నాడని అపార్థం చేసుకున్నమని, ఇద్దరు అన్నాచెళ్లెల్లా..? అని ఆశ్చర్య పడుతున్నారు. ఇక సిరాజ్ కూడా అదే పోస్టుపై బహన్ అంటే చెల్లెలు అని సంబోధించాడు.
సిరాజ్‌కు విశ్రాంతి..
ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న వైట్ బాల్ సిరీస్‌లతోపాటు ఛాంపియన్ ట్రోఫీకి కూడా సెలెక్టర్లు సిరాజ్‌కు విశ్రాంతిని ఇచ్చారు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో సిరాజ్ అంతంత మాత్రంగానే రాణించాడని భావించిన సెలెక్టుర్లు అతడిని వైట్ బాల్ క్రికెట్‌కు పక్కన పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఎదురవుతున్నాయి. పెద్దగా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని, వారి నిర్ణయాల్లో హేతుబద్ధత కన్పించడం లేదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా 2023 నుంచి వన్డేల్లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసింది, సిరాజేనని అలాగే, అత్యధిక వికెట్లు కూడా సిరాజే తీశాడని అలాంటి ప్లేయర్ ను పక్కన పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. గాయాల పాలైన స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు రిజర్వ్ గా సిరాజ్ ఉండే వాడని, ఎందుకని అతడిని పక్కన పెట్టారని విమర్శించాడు.
పఠాన్ అభ్యంతరం..
కనీసం ఛాంపియన్స్ ట్రోఫీకి బ్యాకప్ పేసర్‌గా సిరాజ్‌ను తీసుకోవాల్సి ఉండేదని భారత మాజా పేస్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. దుబాయ్‌లో ఆడే మ్యాచ్‌ల్లో నలుగురు స్పిన్నర్ల అవసరం ఏంటని ప్రశ్నించాడు. బుమ్రా, షమీ గాయాల నుంచి కోలుకుని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోతున్నారని, ఇదంతా సవాలుతో కూడుకున్నదని, అలాంటి సమయంలో సిరాజ్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఏదేమైనా సెలక్టర్లు ఏం ఆశించి జట్టును ఎంపిక చేశారో, ఆ సత్ఫలితాలు రావాలని ఆకాంక్షించాడు. ఇప్పుడు వారి నిర్ణయాలను సమర్థించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదంటూ నిరాశ వ్యక్తం చేశాడు. వచ్చేనెల 19 నుంచి పాకిస్థాన్ లో ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో 20 నుంచి ప్రారంభమవుతాయి. 20న బంగ్లాదేశ్, 23న పాక్, మార్చి 2న న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.
Also Read: Tilak World Record: తిలక్ తాజా వండర్ - ప్రపంచ రికార్డు బద్దలు, టీ20ల్లో అత్యధిక పరుగులతో...