Just In





Tilak World Record: తిలక్ తాజా వండర్ - ప్రపంచ రికార్డు బద్దలు, టీ20ల్లో అత్యధిక పరుగులతో...
Tilak Varma: లేటేస్ట్ వండర్ తిలక్ వర్మ టీ20ల్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. నాటౌట్‌గా ఉంటూ, అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

Ind VS Eng Chennai T20 News: ఇంగ్లాడ్‌తో చెన్నైలో జరిగి రెండో టీ20లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ స్టన్నింగ్ ఫిఫ్టీ (55 బంతుల్లో2 నాటౌట్)తో చివరికంటా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే తను ఈ ఇన్నింగ్స్‌తో టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. నాటౌట్‌గా ఉంటూ, అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఫుల్ మెంబర్ స్క్వాడ్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. గత నాలుగు టీ20ల్లో అజేయంగా ఉంటూ 318 పరుగులను తిలక్ వర్మ సాధించాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్మన్ పేరిట ఉంది. తను 271 పరుగులతో ఈ రికార్డు నెలకొల్పగా చెన్నై ఇన్నింగ్స్‌తో తిలక్ ఈ రికార్డును బద్దలుకొట్టాడు.
రెండు వరుస సెంచరీలు..
గతేడాది సౌతాఫ్రికాలో జరిగిన పర్యటనలో వరుస సెంచరీలతో తిలక్ వర్మ సత్తా చాటిన సంగతి తెలిసిందే. తొలుత 56 బంతుల్లో 107 పరుగులు చేసి కెరీర్లో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసిన తిలక్.. తర్వాతి మ్యాచ్ లోనూ 47 బంతుల్లోనే 120 పరుగులు చేసి తన వ్యక్తిగత స్కోరును మరింత మెరుగు పర్చుకున్నాడు. అలాగే టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ గానూ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో సిరీస్ లో కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్.. శనివారం మ్యాచ్ లో 72 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. గతంలో చాప్ మన్ ఐదు ఇన్నింగ్స్ లో అజేయ రికార్డును సాధించాడు. వరుసగా 15, 104, 71, 16, 65 పరుగులు చేసి మొత్తం 271 పరుగులతో అజేయ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
లిస్టులో మరో భారతీయుడు..
అజేయంగా అత్యధిక పరుగులు చేసిన ఫుల్ మెంబర్ టీమ్ జట్టులోని టాప్-5 ఆటగాళ్లలో తిలక్ వర్మతోపాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. తను గతంలో అజేయంగా 240 పరుగులు సాధించాడు. ఈక్రమంలో వరుసగా 36, 73, 74,57 పరుగులతో సత్తా చాటాడు. ఈ లిస్టులో మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఉన్నారు. ఆరోన్ ఫించ్ అజేయంగా 240 పరుగులు సాధించాడు. తను వరుసగా 172, 68 పరుగులు చేసి ఈ క్లబ్బులో స్థానం సంపాదించాడు. అలాగే డేవిడ్ వార్నర్ 239 పరుగులు చేశాడు. తను వరుసగా 36, 73, 74, 57 పరుగులు సాధించి ఈ రికార్డులో భాగం అయ్యాడు. ఇక ఇంగ్లాండ్ తో జరిగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. శనివారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 165/9 చేయగా, ఛేదనను భారత్ 19.2 ఓవర్లలో 166/8 చేసి పూర్తి చేసింది. ఈక్రమంలో 2 వికెట్లతో విజయం సాధించింది. సిరీస్ లో తర్వాత టీ20 రాజకోట్ లో ఈనెల 28న జరుగుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు ఉండగానే భారత్ కైవసం చేసుకుంది.
Also Read: U19 T20 World Cup: భారత్ నాలుగో విక్టరీ - తెలంగాణ ప్లేయర్ త్రిష దూకుడు, 8 వికెట్లతో బంగ్లా చిత్తు