Team India Failed In Work Load Management: ఆస్ట్రేలియా పర్యటన సుదీర్ఘంగా సాగింది. నవంబర్ లో ప్రారంభమైన ఈ సిరీస్ లో జనవరి మొదటి వారంలో ముగిసింది. ఐదు టెస్టులపాటు సాగిన ఈ సిరీస్ లో బౌలర్లు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఐదు టెస్టులు ఆడిన మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 150కిపైగా ఓవర్లు వేశారు. ఇద్దిరిలో 157 ఓవర్లలతో సిరాజ్ అగ్రస్థానంతో నిలవగా, 153 ఓవర్లతో బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేయలేక పోవడం వల్లే ఈ స్థాయిలో బౌలర్లు కష్టపడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా రొటేషన్ పాలసీలో ఆడించాడినికి కావాల్సిన బౌలర్లు భారత్ వద్ద లేరు అనేది సత్యం. ఇక గాయం కారణంతో మహ్మద్ షమీ దూరం కావడం కూడా దెబ్బ కొట్టింది. దీంతో చివరి టెస్టు కీలక దశలో బుుమ్రా దూరం కావడం మ్యాచ్ తోపాటు సిరీస్ కూడా దూరానికి కారణమైందన్న వాదనలు ఉన్నాయి. ఇక ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 167 ఓవర్లు వేసి సిరీస్ లో టాప్ లో నిలిచాడు. మొత్తానికి టీమ్ మేనేజ్మెంట్ లోపంతోనే బుమ్రా గాయపడినట్లు స్పష్టమవుతోంది.


2023 నుంచి హయ్యెస్ట్..
ఇక 2023 నుంచి మహ్మద్ సిరాజ్ మూడు ఫార్మాట్లు ఆడుతూ, ఈ కాలంలో అత్యధిక ఓవర్లు వేసిన పేసర్ గా నిలిచాడు. ఈ కాలంతో తను ఏకంగా 623 ఓవర్లకుపైగా బౌలింగ్ చేశాడు. మొత్తం 57 మ్యాచ్ లు ఆడిన సిరాజ్.. 27కిపైగా సగటుతో 104 వికెట్లు తీశాడు. నిజానికి ఆ సమయంలో భారత్ 110 మ్యాచ్ లు ఆడగా, సగం మాత్రమే ఆడిన సిరాజ్.. ఈ లెవల్లో బౌలింగ్ చేశాడు. బుమ్రా 2023 నుంచి ఇప్పటివరకు 560కిపైగా ఓవర్లు వేశాడు. తను 42 మ్యాచ్ లే ఆడాడు. 124 వికెట్లు తీసి సత్తా చాటాడు.  మొత్తం మీద 2023 నుంచి అత్యధికంగా ఓవర్లు బౌలింగ్ చేసి బౌలర్ గా భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నిలిచాడు. తను 56 మ్యాచ్ లు ఆడి, 830 ఓవర్లు వేసి, 115 వికెట్లు తీశాడు.  


టెస్టుల్లోనూ వైవిధ్యత అవసరం..
బోర్డర్ -గావస్కర్ సిరీస్ లో భారత్ ఓడిపోవడానికి వైవిధ్యం లేని భారత బౌలింగ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా సీమర్లు అంతా కుడి చేతి వాటం బౌలర్లు కావడం గమనార్హం. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రిసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్ ఇలా అంతా ఒకే రకమైన బౌలర్లు ఉన్నారు. అదే ఆసీస్ విషయానికి వస్తే కమిన్స్ , బోలాండ్, హేజిల్ వుడ్ కుడి చేతివాటం కాగా, మిషెల్ స్టార్క్ ఎడమ చేతివాటం బౌలర్. ఇలా వారిలో వైవిధ్యం కనిపించింది. మరోవైపు దేశవాళీల్లో చాలామంది ఎడమ చేతి వాటం బౌలర్లు ఉన్నప్పటికీ టీమిండియా వారిని ఈ సిరీస్ కోసం గ్రూమ్ చేయకపోవడం వ్యూహ లేమిని సూచిస్తోంది.


ముఖ్యంగా ఆసీస్ ప్లేయర్లు లెఫ్టార్మ్ పేసర్లకు తడబడతారని తెలిసి వారిని ఆడించక పోడం గమనార్హం. అర్షదీప్ సింగ్, జైదేవ్ ఉనాద్కట్, ఖలీల్ అహ్మద్ రూపంలో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. ఇక ఆసీస్ పర్యటనకు వెళ్లిన లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ ను దేశవాళీ టోర్నీ కోసం భారత్ కు పంపడం కొసమెరుపు. ఏదేమైనా సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగితేనే బీజీటీలో ఓటమిలాంటి వాటిని నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. 


Also Read: Gavaskar Humiliated: ఇండియన్ అనే అవమానించారు.. బీజీటీ ప్రదానోత్సవానికి తనను పిలవకపోవడంపై గావస్కర్ అసంతృప్తి