MS Dhoni Birthday: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని  నేడు 42వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే.  పైకి కూల్ గా కనిపించినా ధోనికి రేసింగ్ అంటే భలే ఇష్టం. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో సిరీస్  ముగిశాక ధోని.. సహచర క్రికెటర్లతో కలిసి గ్రౌండ్ లోనే ఓ  రెండు రౌండ్లు వేసేవాడు. ఇప్పటికీ ధోని బయటకు వెళ్లడానికి బైక్ నే యూజ్ చేస్తాడు. మార్కెట్లోకి కొత్తగా హైఎండ్ మోడల్స్ బైక్స్, కార్స్ వస్తే అవి ధోని గ్యారేజ్ లోకి రావాల్సిందే. యుక్త వయసులో ఉన్నప్పట్నుంచే మహీ.. బైకుల మీద మోజు పెంచుకున్నాడు. ధోని వద్ద ఉన్న  బైకులు, కార్ల కలెక్షన్ ఏంటో ఇక్కడ చూద్దాం. 


ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థలలోని ‘ది బెస్ట్’ అనదగ్గ బైక్స్ ధోని వద్ద ఉన్నాయి. కవాసకీ, యమాహ,  సుజూకీ,  హార్లీ డేవిడ్సన్, డుకాటి సంస్థలకు చెందిన బైక్స్ ధోని గ్యారేజ్ లో ఉన్నాయి.  ఒక నివేదిక ప్రకారం ధోని వద్ద 12 బైక్స్ ఉన్నాయి. అవేంటో, వాటి విలువకు సంబంధించిన వివరాలు ఇవే.. 


బైక్స్ మోడల్స్, ధర వివరాలు : 


1. కవాసకీ  :  నింజా హెచ్2 (మోడల్) - రూ. 35 లక్షలు 
2. కాన్ఫడరెట్ : ఎక్స్132 హెల్కట్ - రూ. 47 లక్షలు 
3. కవాసకీ : నింజా జెడ్ఎక్స్ - 14 ఆర్  - రూ. 19 లక్షలు 
4. హార్లీ డేవిడ్సన్ : ఫ్యాట్బాయ్ - రూ. 17 లక్షలు 
5. డుకాటి : 1098 - సుమారు రూ. 30 లక్షలు
6. యమహ : ఆర్డీ 350 - రూ. 30 వేలు (ధోని తొలినాళ్లలో కొన్న బైక్ ఇది)
7. యమహ : రాజ్దూత్ -  రూ. 80 వేలు 
8. సుజూకీ : షోగన్ - రూ. 18 వేలు
9. యమహ : థండర్క్యాట్ - రూ. 15 లక్షలు
10. బీఎస్ఎ : గోల్డ్ స్టార్ 
11. నోర్టాన్ : జుబ్లీ 250 - రూ. 3 లక్షలు 
12. టీవీఎస్ :  అపాచీ ఆర్ఆర్ 310 -  సుమారు రూ. 3 లక్షలు  
13. సుజూకీ : హయబుస - రూ. 17 లక్షలు 


 






 






కార్స్.. 


1. ఫెరారి 599 జీటీవో  : రూ. 35 లక్షలు 
2. పొంటియాక్ ఫైర్ బర్డ్ : రూ. 70 లక్షలు 
3. నిస్సాన్ 1 టన్ జొంగ : రూ. 12 లక్షలు 
4. హమ్మర్ హెచ్ 2 : రూ. 37 లక్షలు 
5. జీప్ గ్రాండ్  చెరోకి : రూ 80 లక్షలు 


ఇవేగాక పలు వింటేజ్ మోడల్ కార్స్ కూడా ధోని గ్యారేజ్ లో ఉన్నాయి.


 






 











Join Us on Telegram: https://t.me/abpdesamofficial