123 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌ భాగమైంది. 2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అధికారికంగా చోటు దక్కించుకుంది. విశ్వక్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్‌తో పాటు స్క్వాష్‌, బేస్‌బాల్‌, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ చేసిన ప్రతిపాదనలకు ముంబయిలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 141వ సెషన్‌లో ఆమోద ముద్రవేశారు. దీనిపై ఓటింగ్‌లో పాల్గొన్న 99 మంది ఐవోసీ సభ్యుల్లో కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. ఇప్పటివరకు విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ఒక్కసారే ఆడారు. 1900వ సంవత్సరంలో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడారు. అందులో ఫ్రాన్స్‌ను ఓడించి ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్‌ క్రీడల్లో క్రికెట్‌ భాగమైంది. పురుషులు, మహిళల విభాగాల్లో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-6 జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రతిపాదనలు చేసింది..


అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) 141వ సమావేశం ముంబై వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి 17 వరకు ముంబై వేదికగా ఐఓసీ సెషన్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్ క్రీడల విషయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు.  ఈ నేపధ్యంలో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ భాగవ్వటంతో   ప్రఖ్యాత ఒలింపిక్స్‌ క్రీడల్లో అభిమానులు ఇక నుంచి క్రికెట్‌ను కూడా తిలకించే అవకాశం ఉంది. ఈమేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. అయితే వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో కాకుండా 2028 లాస్‌ ఏంజిల్స్‌ గేమ్స్‌ నుంచి పురుషులు, మహిళల క్రికెట్‌ను చేర్చారు.


ఇప్పటికే వరల్డ్ కప్‌, ఆసియా కప్, ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న అభిమానులకు ఇప్పుడు  విశ్వ వేదికపై క్రికెట్‌ను చూసే అవకాశం దక్కింది. ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ద్వారా భారత్‌లో ప్రసార హక్కుల నుంచి భారీగా సొమ్ము రాబట్టాలని కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ భావిస్తోంది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రసార హక్కులు రూ.158.6కోట్లు కాగా.. క్రికెట్‌ను చేరిస్తే 2028 నాటికి ప్రసార హక్కులు రూ.1,525 కోట్లకు చేరుకోవచ్చు. సుమారు రూ.15 వేల కోట్లు కేవలం ప్రసార హక్కుల ద్వారానే ఐవోసీకి లభిస్తాయని అంచనా వేస్తున్నారు. 



 1900లో జరిగిన తొలిసారి ఒలింపిక్స్ లో క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. 1900లో జరిగిన పారిస్‌ ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్ ఆడించారు. ఆ ఏడాది ఫైన‌ల్లో ఫ్రాన్స్‌పై బ్రిట‌న్ గెలిచింది. ఆ రోజుల్లో ప్రతి జ‌ట్టులో 12 మంది ఆట‌గాళ్లు ఉండేవారు. రెండు రోజుల పాటు మ్యాచ్‌లు జ‌రిగేవి.  కానీ ఆ తర్వాతి నుంచి ఈ ఆటను పక్కన పెట్టేసారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో ప్రతీ ఒలింపిక్స్ ముందు క్రికెట్‌ను చేర్చాలనే డిమాండ్ వ్యక్తమైంది.  ఈ క్రమంలో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడంపై ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ ఒకటన్న నీతా  ఎక్కువ మంది చూస్తున్న క్రీడల్లో క్రికెట్ రెండో స్థానంలో ఉందని గుర్తు  చేశారు. 140 కోట్ల భారతీయులకు క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు.. అదొక మతం అన్నారు . ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడం ద్వారా విశ్వక్రీడలకు మరింత ఆదరణ, ప్రాచుర్యం పెరిగే అవకాశం ఉందని,  అలాగే  క్రికెట్ పాపులారిటీ కూడా  ప్రపంచ వ్యాప్తంగా మరింతగా పెరిగే అవకాశం ఉందిని వ్యాఖ్యానించారు.