Kohli Anushka Couple Dance Video Edited To Kurchi Madathapetti Song : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఒక ఊపు ఊపేసింది. ఈ పాటకు ప్రిన్స్ మహేష్‌బాబు, శ్రీలీ(Sri Leela)ల మాస్ స్టెప్పులతో దుమ్ములేపారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా ఎక్కడ చూసినా కూడా కుర్చీని మడతబెట్టి రీల్సే దర్శనమిస్తున్నాయి. . ఇదే పాటకు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat kohli), తన భార్య అనుష్క శర్మ(Anshuka Sharma)తో కలిసి స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఇదే ఆలోచన ఓ నెటిజన్‌కు వచ్చింది. అంతేగతంలో విరుష్క జంట ఏదో పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను ఎడిట్ చేసి కుర్చీ మడత పెట్టి సాంగ్‌ను జోడించారు. ఈ ఎడిట్‌కు సింక్ బాగా కుదరడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో హోరెత్తుతోంది. ఈ డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కామెంట్ల వర్షం కురుస్తోంది.
పాక్ క్రికెటర్ ఏమన్నాడంటే..?
కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోతే అంతకన్నా పిచ్చి నిర్ణయం ఇంకోటి ఉండదని పాక్ క్రికెటర్ మహమ్మద్ ఇర్పాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్ ఆడిన వారేనని కూడా విమర్శించాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ విధ్వంసాన్ని చూడలేదా అని నిలదీశాడు. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో విరాట్ ఒంటిచేత్తో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలని.. భారత జట్టుకు కోహ్లీ అతిపెద్ద ఆస్తి అని ఇర్ఫాన్ అన్నాడు. కోహ్లీ ఉంటే మానసికంగా భారత్ పైచేయి సాధిస్తుందని కూడా అన్నాడు. విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలని కూడా ఇర్ఫాన్ వెల్లడించాడు. కోహ్లీ లేకపోతే భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్ లీగ్ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేదిన్నాడు . వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. . తృటిలో వరల్డ్‌కప్ చేజారినా ఈ టోర్నమెంట్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అందరికి గుర్తే. 765 పరుగులు సాధించి లీడింగ్ రన్‌స్కోరర్ గా రికార్డ్ సాధించాడు. దాదపు 95 యావరేజ్‌తో ఆడిన కోహ్లీ మెత్తం 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో కదం తొక్కాడు.
అభిమానుల ఆగ్రహం
అయితే, 2024 టీ20 ప్రపంచకప్‌నకు కోహ్లిని ఎంపిక చేయకపోవచ్చే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విరాట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. టీ20 లకు మాత్రమే కాదు, క్రికెట్ లో కోహ్లీ రికార్డులను గుర్తుచేస్తున్నారు. గతంలో గెలిపించిన మ్యాచ్‌లను గుర్తు చేస్తున్నారు. బీసీసిఐ ఈ ఆలోచనను తక్షణం విరమించుకోవాలనే కింగ్ కోహ్లీ జట్లులో ఉండాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.