India Vs England News: భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెడ్ బాల్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కేఎల్ రాహుల్ జ‌ట్టులో సీనియ‌ర్ మోస్ట్ బ్యాట‌ర్ గా నిలిచాడు. తొలి టెస్టులో సీనియ‌ర్ గా త‌న టెంప‌ర్ మెంట్ ను చూపించాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో 42 ప‌రుగులు చేసిన రాహుల్, రెండో టెస్టులో అద్భుత సెంచ‌రీతో (137 ర‌న్స్)తో అద‌ర‌గొట్టాడు. అయితే ఇటీవ‌లే బిడ్డ‌కు తండ్రి అయిన రాహుల్.. ఇంగ్లాండ్ టూర్ ను స్కిప్ చేయ‌కుండా, త‌న క‌మిట్మెంట్ ను చూపించాడు. ఈ మ్యాచ్ లో సినీయ‌ర్ ప్లేయ‌ర్ గా త‌న విలువేంటో చాటి చెప్పాడు. తాజాగా అత‌నిపై మాజీ క్రికెట‌ర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోచ్ హేమంగ్ బ‌దానీ ప్ర‌శంస‌లు కురిపించాడు. క‌మిట్మెంట్ విష‌యంలో రాహుల్ అద్భుత‌మైన వ్య‌క్త‌ని పేర్కొన్నాడు. 

స్క్వాడ్ తోపాటే..నిజానికి గ‌త మార్చిలోనే రాహుల్ ఒక బిడ్డ‌కు తండ్రి అయ్యాడ‌ని, ఐపీఎల్ ఆడుతూ, ఆ త‌ర్వాత ఇంగ్లాండ్ టూర్ కు ముందుగానే వ‌చ్చాడ‌ని బ‌దానీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు ఇంట్రా స్క్వాడ్ మ‌ధ్య జ‌రిగిన గేమ్ లో నూ పార్టిసిపేట్ చేశాడ‌ని తెలిపాడు. కావాల‌నుకుంటే సీనియ‌ర్ ప్లేయ‌ర్ గా ఈ మ్యాచ్ ను స్కిప్ చేసి, నేరుగా తొలి టెస్టులోనే ఆడేవాడ‌ని, అయితే క‌మిట్మెంట్ తోనే త‌ను జ‌ట్టుతో పాటే వ‌చ్చాడ‌ని తెలిపాడు. ఇక గతేడాది బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఓపెనర్ గా ఆడి సత్తా చాటినప్పటి నుంచి, రాహుల్ ఇదే స్థానంలో ఆడుతున్నాడు. ఇప్పటివరకు తన బ్యాటింగ్ ఆర్డర్ పై స్పష్టత లేదు. అయితే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో తనకెంతో ఇష్టమైన ఓపెనింగ్ పొజిషన్ ను తను అస్వాదిస్తున్నాడు. 

జ‌ట్టుకు మార్గ‌ద‌ర్శ‌కం..ప్ర‌స్తుత జ‌ట్టు యువ‌రక్తంతో నిండి ఉండ‌ని, సీనియ‌ర్ ప్లేయ‌ర గా రాహుల్ వారికి మార్గ‌ద‌ర్శ‌కం చేస్తున్నాడ‌ని బ‌దాని పేర్కొన్నాడు. క‌రుణ్ నాయ‌ర్ త‌ప్ప మిగ‌తా బ్యాట‌ర్లు 30వ ప‌డిలోప‌లే ఉన్నార‌ని, ఇంగ్లాండ్ లో రాణించేందుకు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు సూచ‌న‌లు, మెళ‌కువ‌లు వారికి రాహుల్ నేర్పిస్తున్న‌ట్లు చెప్పాడు. ముఖ్యంగా య‌శ‌స్వి జైస్వాల్, కెప్టెన్ శుభ‌మాన్ గిల్, నితీశ్ రెడ్డి, సాయి సుద‌ర్శ‌న్ లాంటి వారికి అందుబాటులో ఉంటూ, వారికి అవ‌స‌ర‌మైన గైడెన్స్ ఇస్తున్నాడ‌ని తెలిపాడు. మ‌రోవైపు ఈ ప‌ర్య‌ట‌న‌లో  తొలి టెస్టులో రాహుల్ రాణించ‌డంపై బ‌దానీ ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇక గ‌తంలోనూ ఇక్క‌డ ఆడిన అనుభవం ఉన్న రాహుల్ మ‌రింత‌గా రాణిస్తాడ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశాడు. గ‌తేడాది సీని న‌టుడు సునీల్ షెట్టి కూతురు, మాజీ హీరోయిన్ ఆతియా షెట్టిని రాహుల్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.