Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !

ICC Chairman Jay Shah | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి, కే్ంద్ర హోమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రయాణం నేటి నుంచి ప్రారంభ కాబోతోంది. 

Continues below advertisement

Jay Shah becomes new ICC chief | అబుదాబి : క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నియంత్రణ మండలి ఐసీసీకి భారత్ కు చెందిన జై షా చైర్మన్ గా ఆదివారం నుంచి పగ్గాలు చేపట్టబోతున్నారు. 2019 నుంచి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శిగా పని చేస్తున్న జై షా.. ఐసీసీ పదవికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో డిసెంబర్ 1 నుంచి ఈ పదవి చేపట్టనున్నారు. ఐసీసీలో డిసెంబర్ 1 నుంచి చైర్మన్ గా జై షా శకం మొదలు కాబోతుందని ఒక ప్రకటనలో ఐసీసీ పేర్కొంది. 

Continues below advertisement

సవాళ్లు ఎన్నో..
చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన జై షా ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడంపై కార్యచరణ రూపొందించాల్సి ఉంటుంది. అలాగే మహిళా క్రికెట్ ను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవశ్యకత కూడా ఉంది. 
మరోవైపు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జై షా మాట్లాడుతూ.. ఈ పదవికి ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఐసీసీ డైరెక్టర్లు, వివిధ బోర్డు మెంబర్లకు ఆయన థాంక్స్ తెలిపారు. రాబోయే ఒలింపిక్స్ లో క్రికెట్ ను నిర్వహించడంపై ఇంకా చాలా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరింత మజా పంచే విధంగా గేమ్ ను తీర్చదిద్దడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. 


కీలకమైన దశలో..
టెస్టు, వన్డే, టీ20 లాంటి మల్టిపుల్ ఫార్మాట్లు ఉండటంతో ప్రస్తుతం క్రికెట్ కీలకమైన దశలో ఉందని, అలాగే మహిళా క్రికెట్ ను మరింత డెవలఫ్ చేయాల్సిన అవసరముందని జై షా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తగా ఆట విస్తరించేందుకు చాలా అవకాశాలున్నాయని, నూతన అవకాశాలను అందిపుచ్చుకుని గేమ్ మరింత విస్తరించేందుకుగాను బోర్డులు, అసోసియేట్ దేశాల సహకారాన్ని తీసుకుంటానని వెల్లడించారు. 

2009 నుంచి ప్రస్థానం..
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో 2009లో జై షా తన జెర్నీని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా జై షా పాలన కాలంలోనే అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం (నరేంద్ర మోదీ స్టేడియం)ను నిర్మించారు. ఇక, 2019లో బీసీసీఐలో కార్యదర్శిగా జై షా కాలు పెట్టారు. అక్కడినుంచి ప్రస్తుతం శక్తివంతమైన ఐసీసీ చైర్మన్ లెవల్ కి ఎదిగారు. జై షాకు ముందు ఐసీసీ చైర్మన్ గా 2020 నుంచి గ్రెగ్ బార్క్లే  వ్యవహరించారు. రెండుసార్లు ఈ పదవిని చేపట్టిన బార్ క్లే.. మూడోసారి సంసిద్ధంగా లేకపోవడంతో జై షా రేసులోకి వచ్చారు. 

Also Read: Joe Root Recods: సచిన్ రికార్డు బద్ధలుకొట్టిన జో రూట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా ఘనత

Continues below advertisement