Konstas Self Goal: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విశ్వరూపం చూపిస్తే ఎలా ఆస్ట్రేలియన్ పేసర్లకు అర్థమైంది. శుక్రవారం బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా జరిగిన ఐదో టెస్టులో ఈ సంఘటన జరిగింది. అప్పటికే సమయం మించిపోతుండటంతో బుమ్రా బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. అయితే స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా ఉద్దేశపూర్వకంగా బ్యాటింగ్ చేయకుండా లేట్ చేస్తున్నాడు. దీనిపై అంపైర్‌కి బుమ్రా ఫిర్యాదు చేస్తుండగా, మధ్యలోకి వచ్చిన ఆసీస్ యువ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్ గలాటా చేశాడు. దీంతో రెచ్చిపోయిన బుమ్రా తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. 






ఇంతకీ ఏం జరిగిందంటే.. 
ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేస్తున్న బుమ్రాను కొన్ స్టాస్ రెచ్చగొట్టాడు. అధి ఆ ఓవర్‌కి చివరిబంతి. ఈ బంతి అయిపోతే మరో ఓవర్ వేసేస్తారేమోనన్న అనుమానంతో ఖవాజా కావాలనే సమయం వేస్ట్ చేస్తున్నాడు. దీనిపై ఒక వైపు బుమ్రా మాట్లాడుతుండగానే, మధ్యలో కొన్ స్టాస్ మాటల యుద్దానికి దిగాడు. అంపైర్ సర్ది చెప్పి శాంతింపజేశాడు. అయితే ఆ బంతికే ఖవాజను ఔట్ చేయడంతో భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా సంబరాలతో ఫైరయ్యారు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్ స్టాస్ దగ్గరికి వేగంగా వెళ్లి, గేలిచేశారు. కోహ్లీతో సహా ఆటగాళ్లంతా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఇక బుమ్రా కూడా వికెట్ తీసిన తర్వాత కోపంగా కాన్ స్టాస్ దగ్గరికి చేరుకున్నాడు. మరోవైపు కాన్ స్టాస్ మాత్రం బేలగా చూస్తూ పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. బుమ్రాను రెచ్చగొడితే ఫలితం ఇలాగే ఉంటుందని భారత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బుమ్రా తాజాగా ఫైరవడంతో రెండో రోజు ఆటపై ఉత్కంఠ నెలకొంది. భారత బౌలర్ల ధాటిని ఆసీస్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో అని పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. 


భారత్ 185 ఆలౌట్..
సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో 185 పరుగులకు భారత్ ఆలౌటైంది. కష్ట సాధ్యమైన పిచ్‌పై బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. రిషభ్ పంత్ 40 పరుగులతో రాణించాడు. చివర్లో బుమ్రా 22 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని చలవతోనే టీమిండియా స్కోరు 185కి చేరుకుంది. చివరి వికెట్‌గా తను వెనుదిరిగాడు. బౌలర్లలో స్కాట్ బోలాండ్‌కు నాలుగు, మిషెల్ స్టార్క్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసేసరికి 9/1తో నిలిచింది. 5 టెస్టుల సిరీస్‌లో ఆసీస్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు గెలిస్తే పదేళ్ల తర్వాత బీజీటీని దక్కించుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది.  


Also Read: Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్