Bumrah Injury Latest Report: ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై ప్రారంభమయ్యే లిమిటెడ్ ఓవర్ల సిరీస్లకు ముందు భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో గాయపడిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్ తో సిరీస్ లకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఐదు టీ20ల సిరీస్ లో బరిలోకి దిగబోడని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి. అయితే వచ్చేనెలలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో మూడు వన్డేల సిరీస్ లో మాత్రం ఆడుతాడని ఆశాభావం వ్యక్తం చేశాయి. నిజానికి వెన్ను నొప్పితో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. ఆ టెస్టు ఓడిపోవడానికి గల కారణాల్లో మేజర్ రీజన్ గా దీన్ని చెప్పుకోవచ్చు.


గ్రేడ్ వన్ గాయం..
నిజానికి బుమ్రాకు అయిన గాయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. టీమ్ మెడికల్ ప్రొఫెషనల్స్ బుమ్రా గాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తనకు గ్రేడ్ వన్ గాయం అయిందని తెలుస్తోంది. దీనికి మూడు వారలపాటు రెస్టు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పునరావసం తీసుకుని, తర్వాత ఫ్రెష్ గా ఆటను ప్రారంభించవచ్చని పేర్కొంటున్నారు. అదే గ్రేడ్ 2 గాయమైతే మూడు నుంచి వారాలు, గ్రేడ్ 3 గాయామైతే 3 నెలల వరకు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బుమ్రాకు గ్రేడ్ వన్ గాయమే అయినట్లు తెలుస్తోంది.


సిడ్నీలో మ్యాచ్ రోజున బుమ్రా గాయానికి స్కాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఏం వచ్చిందో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లకు తను అందుబాటులో ఉండే విషయమై క్లారిటీ లేదు. మరోవైపు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో బుమ్రా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. రోహిత్ శర్మ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో బుమ్రానే టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 


మూడో వన్డే ఆడే అవకాశం..
నిజానికి ఈ ఏడాది ప్రపంచకప్పులు లేనందును బుమ్రాకు లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ల్లో విశ్రాంతినివ్వాలని తొలుత బోర్డు భావించింది. అయితే అనుకోని ఆపదలా ఆస్ట్రేలియా సిరీస్ లో బుమ్రా గాయపడ్డాడు. దీంతో చాంపియన్స్ ట్రోఫీకి తను దూరమయ్యే అవకాశముందని తొలుత అనుమానాలు రేగినా, తన గాయాన్ని బట్టి మెగాటోర్నీలో బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. ఈ టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లాండ్ తో చివరి రెండు వన్డేల్లో బుమ్రా ఆడే అవకాశముంది.


కాకపోతే చివరి వన్డే జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం బుమ్రాకు హోం గ్రౌండ్ కావడంతో ఆ మ్యాచ్ లో బుమ్రా బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 12న జరుగుతుంది. ఇక చాంపియన్స్ ట్రోపీ పాకిస్థానలో వచ్చేనెల 19 నుంచి జరుగుతుంది. తన తొలి మ్యాచ్ ను దుబాయ్ లో బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న ఆడుతుంది. 


Also Read: Rohit Captaincy Record: 46 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు ఫీట్ నమోదు చేసిన టీమిండియా - కెప్టెన్ రోహిత్ ఖాతాలోకి అన్ వాంటెడ్ రికార్డు